పూజా హెగ్డే- బాలయ్య కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..బ్రతికిపోయాడు పో..!!

ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య హీరోయిన్ పూజ హెగ్డే కాంబోలో ఓ సినిమా రావాల్సింది . అది మిస్ అయిపోయింది . దీనికి సంబంధించిన వార్తలను ట్రెండ్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు . రీసెంట్గా ఆయన నటించిన భగవంత్ కేసరి హిట్ అవ్వడంతో మరోసారి ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు.

గోపి చంద్ మల్లినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ పాత్రకు ముందుగా పూజ హెగ్డేను అప్రోచ్ అయ్యారట గోపీచంద్ మలినేని. “అయితే అంత పెద్ద హీరోతో నేను నటించలేను ..నాకు తర్వాత హీరోయిన్ పాత్ర లు రావు అంటూ భయపడిపోయి పూజ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట “.

ఆ కారణంగానే బాలయ్య – పూజా హెగ్డే కాంబోలో రావాల్సిన సినిమా మిస్సయింది. ఏ మాటకు ఆ మాటే శృతిహాసన్ పాత్రలో పూజ కన్నా.. శృతిహాసన్ నే బాగా నటించింది అంటున్నారు నందమూరి అభిమానులు. చూదాం మరి వీళ్ల కాంబోలో ఇంకో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో..?