“త్వరలోనే గుడ్ న్యూస్”.. పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్..!!

శృతిహాసన్.. పెళ్లి చేసుకోబోతుందా ..? అంటే అవుననే ఆన్సర్ ఎక్కువగా వినిపిస్తుంది . కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునింది . కేవలం తెలుగులోనే కాదు కోలీవుడ్ బాలీవుడ్ లో కూడా సినిమాలో నటించింది . ప్రభాస్ నటించిన సలార్.. సినిమాతో తన రేంజ్ ను మార్చుకోబోతున్న శృతిహాసన్..

హాలీవుడ్ లోనూ పలు సినిమాలలో నటించడం గమనార్హం . కాగా కెరియర్ పరంగా ఎంతో పిక్స్ లో ఉన్న శృతిహాసన్ సంతాను హజారికాను ప్రేమిస్తుంది.. డేటింగ్ లో ఉంది .ఈ విషయాన్ని అఫీషియల్ గానే ఒప్పుకునింది . అయితే రీసెంట్గా శృతిహాసన్ తన సోషల్ మీడియా ఖాతాలో..” త్వరలోనే గుడ్ న్యూస్.. ఈ సీక్రెట్ ను ఎక్కువ కాలం దాచలేను” అంటూ పోస్ట్ చేసింది .

ఇది ముమ్మాటికి ఆమె పెళ్లికి సంబంధించిన వార్త అంటున్నారు అభిమానులు అంతేకాదు శృతిహాసన్ పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కమలహాసన్ కోరిక కూడా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మన శృతి హాసన్ కూడా పెళ్లి చేసుకోబోతుంది.. ఇక మిగిలింది ప్రభాస్ నే..!!