ఎన్టీఆర్ హీరో కాకపోయి ఉంటే.. ఏమై ఉండేవాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి బ్యాగ్రౌండ్ ఉన్న ఏమాత్రం సపోర్ట్ లేకుండా సొంత కష్టంతో ఎదుగుతూ వచ్చిన ఎన్టీఆర్‌కి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో కెరీర్ మారిపోయింది. ఈ సినిమా తర్వాత వరుసగా సింహాద్రి, ఆది, నాగ, సాంబా లాంటి ఎన్నో బ్లాక్ వాస్టర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక చివరిగా రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు యంగ్ టైగర్.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ – కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. అయితే తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఒకవేళ హీరో కాకపోతే ఏమై ఉండేవాడు తెలుసుకోవాలని ఆసక్తి అభిమానులతో పాటు చాలామంది సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఉంటుంది. ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై మాట్లాడుతూ నేను సినిమాల్లోకి రాకపోతే ఓ బిజినెస్ మ్యాన్ గా సెటిల్ అయ్యే వాడిని అంటూ వివ‌రించాడు.

అయితే నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండి వ్యాపారవేత్తగా సెటిల్ కాకపోయి ఉంటే.. సినిమాల్లోకి వచ్చి హీరోగా ఈ స్థాయికి రాకపోయినా… కనీసం లైట్ బాయ్‌గా అయినా సినిమాల్లోనే ఉండేవాడిని అంటూ ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు నేటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు.