ఒక్క సినిమాకే రూ.3కోట్ల తీసుకుంటున్న త్రిష.. ఎన్ని కోట్లకు యువరాణో తెలిస్తే నోరెళ్ళపెడతారు..!!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో త్రిష ఒకటి. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న త్రిష ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుస సినిమాలతో అలరిస్తూ ఫుల్ బిజీ స్కెడ్యూల్ గడుపుతుంది. ఇటీవల మణిరత్నం డైరెక్షన్లో రూపొందిన పొనియ‌న్ సెల్వ‌న్ సినిమాతో త్రిష క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇందులో కుందువై పాత్రలో అద్భుతంగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత విజయ్ దళపతి లియో మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. దసరా సందర్భంగా రిలీజ్ అయిన మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక ప్రస్తుతం సినిమాకు రూ.3 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న త్రిష. లియో సినిమాకి రూ.4 కోట్లు తీసుకుందట. అలాగే ఇకపై కొత్త ప్రాజెక్టులకు రూ.10 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ప్రస్తుతం అజిత్ జంటగా నటిస్తున్న త్రిష పలు ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ నెలకు రూ.70 లక్షల వరకు సంపాదిస్తుంది.

ప్రస్తుతం దాదాపు సంవత్సరానికి రూ.10 కోట్లకు పైగా ఆదాయాన్ని గడుస్తున్న ఈ ముద్దుగుమ్మకు చెన్నైలో రూ.7 కోట్ల విలువైన భావనం ఉందట. అలాగే హైదరాబాద్‌లో రూ.6 కోట్ల విలువైన ఇల్లు ఉన్నట్లు సమాచారం. ఇక రూ.80 లక్షల విలువైన మెర్సడేస్ బెంచ్, రూ.75 లక్షల విలువైన బీఎండబ్ల్యూ 5 సిరీస్, రూ.60 లక్షల రేంజ్ రోవర్, రూ.5లక్షల బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పటివరకు త్రిష రూ.85 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో త్రిష ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా నోరెళ్లబెడుతున్నారు.