ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్ సెలబ్రెటీస్ వరుసగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు మొత్తం వరుసగా పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్, వెంకటేష్ కూతురు, అర్జున్ కూతురు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయారు . రీసెంట్ గా మరో హీరోయిన్ సైతం పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయింది . ఆమె మరెవరో కాదు బస్ స్టాప్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీదివ్య .
బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీదివ్య తెలుగు అమ్మాయి మారుతి దర్శకత్వంలో వచ్చిన బస్ స్టాప్ కేరింత సినిమాలో మాత్రమే నటించింది. ఆ తర్వాత తమిళ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించి ..అక్కడ సెటిల్ అయిపోయింది . అక్కడ బడా స్టార్ హీరోయిన్ . ప్రస్తుతం విక్రమ్ ప్రభు రైడ్ సినిమాలో హీరోయిన్గా చేసింది . ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది .
ప్రమోషన్స్ లో భాగంగా శ్రీదివ్య ను .. రిపోర్టర్స్ ప్రేమ – పెళ్లి పై ప్రశ్నించారు . దీంతో వెంటనే స్పందించిన ఈ బ్యూటీ “త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాను అని ..అది కూడా లవ్ మ్యారేజ్ అని ..అది కూడా నా లవర్ ని” అంటూ గట్టిగా నొక్కి చెప్పింది. దీనితో ఎవరు ఆ కుర్రాడు..? ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది ఆమె..? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి . అయితే మొదటి నుంచి ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్ అయిన ప్రొడ్యూసర్ ఫ్రెండ్ తో శ్రీదివ్య ప్రేమాయణం నడుపుతుంది అన్న వార్త బలంగా వైరల్ అయింది . బహుశా ఆయననే పెళ్లి చేసుకోబోతుందేమో..? అంటూ చెప్పుకుంటున్నారు జనాలు..!