భగవంత్ కేసరి ప్రీమియర్ ఫో టాక్.. బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టేసినట్టే..

నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా, కాజల్ హీరోయిన్గా, శ్రీ లీల కీలక పాత్రలో నటించిన మూవీ భగవంత్‌ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పై ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టీజర్ ట్రైలర్లతో పాటుగా రిలీజ్ అయిన రెండు సాంగ్‌లు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించాయి. ఈ సినిమా ఇటు విజయ్ లియో, అటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పోటీగా రిలీజ్ అవుతుంది. ఈరోజు థియేటర్లో రిలీజ్ కానున్న ఈ సినిమా కు నిన్న రాత్రి ప్రీమియర్ షోలు వేశారు.

నిన్న రాత్రి వేసిన ప్రీమియర్ షోలో ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక బాలయ్య సినిమా పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఇండస్ట్రీ సర్కిల్లో ఏ రేంజ్ లో టాప్ నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా చూసిన ఇండస్ట్రీ జనాలు అనిల్ రావిపూడి టేకింగ్ చాలా బాగుందని కచ్చితంగా ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ కే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.

The Emotion Of Bhagavanth: Soul Stirring

ఇప్పటికే బాలయ్య అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హీట్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ కొట్టినట్లే అని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూసర్లుగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా సీ. రామ్‌ప్రసాద్ వ్యవహరించాడు. తమ్మి రాజు ఎడిటర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు ఎస్.ఎస్ థ‌మన్ సంగీతం అందించాడు.