మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి పెళ్లి టైం వచ్చేసిందా..? ప్రభాస్ ని మీట్ అయిన అనుష్క తండ్రి..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ హ్యాండ్సమ్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే కళ్ళు మూసుకుని.. టక్కున చెప్పే పేరు ప్రభాస్ . ఆరు అడుగుల అందగాడు ..అందానికి తగ్గ హైట్.. ఆ హైట్ కి తగ్గ వెయిట్ .. ఆ కటౌట్ చూసి ఎవ్వరైనా సరే పడిపోవాల్సిందే ..పడి చచ్చిపోవాల్సిందే ..మరి ఇలాంటి అన్ని మంచి లక్షణాలు ఉన్న అబ్బాయికి ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు ..? అంటే మాత్రం ఎవరి దగ్గర ఆన్సర్ లేదు .

త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుందా..? ఎక్కడ దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. కానీ రీసెంట్గా ప్రభాస్ – అనుష్క ఫాదర్ కలవడం అభిమానులకు ఎక్కడో తెలియని ఓ ఆనందాన్ని కలగజేస్తుంది . ఇది పెళ్లి గురించి ఆరోగ్యం పరంగా పరామర్శించారా ..? అనేది పక్కన పెడితే కచ్చితంగా అనుష్క ప్రభాస్ ల పెళ్లి గురించి టాపిక్ అయితే వచ్చి ఉంటుందని..

అది పాజిటివ్గా అయితే త్వరలోనే మనం గుడ్ న్యూస్ వినబోతున్నామని ..ప్రభాస్ ఫ్యాన్స్ లో లోపల ఫీల్ అయిపోతున్నారు. అంతేకాదు అనుష్క శెట్టి సైతం ప్రభాస్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందట . మన ప్రభాసే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఊపలేదు . చూద్దాం దీనిపై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో..?