రూ.125 కోట్లతో డ్రీమ్ హౌస్ కట్టుకున్న హీరోయిన్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

బ్యూటిఫుల్ కైలీ జనరల్ అమెరికన్ హాట్ బ్యూటీ అయినా ఈ అమ్మ‌డు పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లో న‌టించింది. అలానే పలు టీవీ షోలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఓషన్ 8 సినిమాలో హీరోయిన్ గా ప్రేక్షకులను మెప్పించింది. ఎవరికైనా తమ అభిరుచికి, స్టేటస్‌కు తగ్గట్టుగా సొంత ఇల్లు కట్టుకోవాలని కల ఉంటుంది. తాజాగా ఈమె తన సొంతింటి కలను నెరవేర్చుకుంది.

ఐదు ఎకరాల స్థలంలో హిడెన్ హిల్స్ ల్యాండ్ లో ఉన్న కైలీ మాన్షన్.. లగ్జరీ లైఫ్ కు అర్ధం ప‌ట్టేలా ఉంది. 15 బెడ్రూమ్స్, అండర్ గ్రౌండ్ గ్యారేజ్, ఇన్ఫినిటీ పూల్, ప్పోర్ట్స్ కోర్ట్ తో పాటు ఇతర లగ్జరియస్ సౌకర్యాలను కలిగిన ఇంటి కన్స్ట్రక్షన్.. 2021 ప్రారంభంలో స్టార్ట్ కాగా ఇప్పుడు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏరియల్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విల్ స్మిత్, కర్దాషియన్ ఫ్యామిలీస్ నైబర్స్ గా ఉన్న ఈ ప్రాంతం.. హాలీవుడ్ రాయల్టీ స్పెషల్ ఎన్క్‌లేవ్‌గా మారింది.

ప్రస్తుతం ఇన్ని లగ్జరీ ఫీచర్స్ ఉన్న ఇంటి గురించి తెలిసిన నెటిజన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. అన్ని కోట్లను దార పోసి మరి అవసరానికి మించి అంత పెద్ద ఇల్లును కట్టుకునే బదులు తనకు సరిపడగా ఒక మంచి హౌస్ నిర్మించుకుని.. మిగతా డబ్బుతో ఏదైనా ఆర్గనైజేషన్‌కు చేయి అందించి ఉంటే బాగుండేది కదా అంటూ నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.