అప్పుడు శ్రీదేవి..ఇప్పుడు జాన్వీ..ఇద్దరు ఒక్కే జబ్బుతో బాధపడుతున్నారా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . అందానికి అందం నటనకి నటన ..అభినయానికి అభినయం.. రెస్పెక్ట్ కి రెస్పెక్ట్.. అన్నిటిని కలగలిసి పుట్టిన కుందనపు బొమ్మ. సినిమా ఇండస్ట్రీని తన అందచందాలతో ఏలేసిన శ్రీదేవి .. కోట్లాదిమంది జనాల మనసు దోచుకున్న విషయం తెలిసిందే.

అయితే శ్రీదేవి ఎక్కడ ఉన్నా సరే తానే స్పెషల్ అట్రాక్షన్ గా నిలవాలి అని.. ఫస్ట్ నుంచి కోరుకుంటుందట . అది ఫంక్షన్ కాదు ..ఈవెంట్ కాదు .. సినిమా కాదు ఎక్కడైనా సరే .. తన కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని .. తానే ఎక్కువ ఆకర్షణీయంగా కనిపించాలని చాలా ట్రై చేస్తుందట . అయితే సేమ్ ఇదే క్వాలిటీస్ జాన్వి కపూర్ కి కూడా ఉన్నాయి అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

జాన్వికపూర్ కూడా ఏదైనా ఈవెంట్ కి వెళ్ళినా ..ఫంక్షన్ కి వెళ్లిన అక్కడ ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలవాలి అని.. ముందు రోజు నుంచే స్పెషల్ కేర్ తీసుకొని మరీ మెరుస్తుందట . అంతేకాదు సినిమాల్లో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉంటే కచ్చితంగా ఆమెకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని డైరెక్టర్స్ కు కండిషన్స్ పెడుతుందట. దీంతో అప్పుడు అమ్మ కున్న క్వాలిటీని ఇప్పుడు కూతురికి వచ్చిందని ఫాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!