షారుక్ కి ఉన్నది ఏంటి..? విజయ్ దేవరకొండ కి లేనిది ఏంటి..? మహేశ్ ఇలా ఇరుక్కునేసాడు ఏంటి..!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు కూడా రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు .. ఏదైనా సరే సినిమా రిలీజ్ అయి హిట్ అయి నచ్చితే సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాకు సంబంధించి పలు పాయింట్స్ మెన్షన్ చేస్తూ స్టార్ హీరో హీరోయిన్లు ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు . అయితే ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలను కూడా మన స్టార్ హీరోలు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా రిలీజ్ అయ్యి హిట్ అవుతున్న సినిమాలను మన స్టార్ హీరోలు పాజిటివ్ రివ్యూ తో ఇంకా హైప్ పెంచేస్తున్నారు .

అయితే రీసెంట్గా రిలీజ్ అయిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి .. జవాన్ సినిమాలకు మహేష్ బాబు తనదైన స్టైల్ లో రివ్యూ ఇచ్చి ఆకట్టుకున్నాడు. అయితే ఇక్కడే విజయ్ దేవరకొండ ఫాన్స్ కు మండిపోయింది . ఎన్నో సినిమాలకు తనదైన స్టైల్ లో రివ్యూ ఇచ్చే మహేష్ బాబు కంటికి విజయ్ దేవరకొండ ఖుషి నటించిన సినిమా గుర్తు రాలేదా ..? అంటూ ప్రశ్నిస్తూ మండిపడుతున్నారు . అంతేకాదు కేవలం డబ్బు పలుకుబడి ఉంటేనే రివ్యూ ఇస్తారా..? అంటూ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు .

అంతేకాదు షారుఖ్ ఖాన్ సినిమాకు అంత హంగామా చేసిన మహేష్ బాబు.. మన తెలుగు హీరో సినిమాకు అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ..? సినిమా బాగుంది అని ఒక్క మెసేజ్ చేస్తే ఏం పోతుంది..? అంటూ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు షారుక్ ఖాన్ కి ఉన్నది ఏంటి ..? విజయ్ దేవరకొండకు లేనిది ఏంటి ..? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో మహేష్ బాబు పేరుని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!