మంచు విష్ణుకు ధన్యవాదాలు చెప్పిన బన్నీ.. వ్యక్తిగతంగా కలుసుకుంటానంటూ..!

ఇటీవల 69వ నేషనల్ అవార్డు ఫ్యాక్టరీలో పుష్ప సినిమాకు అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎందరో సినీ ప్రముఖులు నేరుగా వచ్చి అల్లు అర్జున్ ప్రసంశించారు. తమ అభినందనలు తెలియజేశారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి కూడా అల్లు అర్జున్‌కి లేక వచ్చింది. ఈ లేఖ‌ తన ఇన్‌స్టా బేదిక‌గా పోస్ట్ చేశాడు బన్నీ. డియర్ అల్లు అర్జున్ మీరు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.

పుష్ప సినిమాలో మీ అసాధన నటనకు ప్రతిష్టాత్మకమైన నేషనల్ అవార్డును అందుకున్నందుకు మీకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున హృదయపూర్వక అభినందనలు అంటూ విష్ణు చెప్పాడు. మీ అంకితభావం, కృషి, నటన మీకు ఇంతటి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఈ అవార్డుకు మీరు అర్హులు. మీ విజయం మీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కూడా గర్వకారణంగా నిలిచింది. జాతీయ అవార్డుకు ఎంపికైన తొలి తెలుగు నటుడు కావడం మీ అసమాన ప్రతిభకు మీ నైపుణ్యానికి నిదర్శనం.

ఈ విశేషమైన విజయం మన పరిశ్రమలో సమర్థతకు ఒక నూతన నిదర్శనం అంటూ విష్ణు రాసుకొచ్చాడు. పరిశ్రమలో ఉన్న హద్దులు దాటి విభిన్నమైన పాత్రలను అన్వేషించడం పట్ల మీ అంకితభావం అందరి హృదయాలను ఆకటుకుంది. జాతీయస్థాయిలో తెలుగు సినిమాలో ఉన్న అపారమైన సామర్థ్యాన్ని చూపించింది. నేను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాను ఈ టైంలో మీకు వ్యక్తిగతంగా నా అభినందనలు తెలియజేయలేకపోతున్నానుఅంటూ వివ‌రించాడు.

అయితే నేను 17వ తేదీన హైదరాబాద్‌కి తిరిగి వస్తాను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకోవడానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను డియర్ బ‌న్ని.. మీరు సాధించిన అసాధారణ విషయాన్నికి మరోసారి మీకు నా అభినందనలు. రాబోయే సంవత్సరంలో మీ ప్రయాణం భారతీయ సినిమా స్థితిగతిని ప్రేరేపించి.. ప్రభావితం చేసేలా కొనసాగుతుంది అంటూ మంచు విష్ణు పేర్కొన్నాడు.