ఈసారి ఆ తప్పు జరగకూడదు.. నాగబాబుకి చిరంజీవి స్ట్రైట్ వార్నింగ్..!?

త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరో వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటికే హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్ధం చేసుకున్న వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన పనులు కూడా చకచగా కంప్లీట్ చేస్తున్నారు . కానీ ఏ విషయాన్ని బయటకు రాకుండా లో లోపలే అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుంటున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే ఈసారి మాత్రం నిహారిక పెళ్లిలో జరిగిన తప్పు జరగకుండా మెగాస్టార్ చిరంజీవి – నాగబాబుకి స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారట.

నిజానికి నిహారిక విడాకులు తీసుకోవడానికి కారణం ఆమె పెళ్లి ముహూర్తం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వీళ్ళ ఫోటోషూట్ హంగామ పేరుతో పెళ్లి ముహూర్తం దాటిపోయిన తర్వాత తాళ్లి కట్టించారని అందుకే వీళ్ళ లైఫ్ అలా మధ్యలోనే మునిగిపోయిందని ..కానీ వరుణ్ తేజ్ విషయంలో మాత్రం అలాంటి తప్పు జరగకూడదు అంటూ చిరంజీవి ముందుగానే నాగబాబుకి హెచ్చరించారట .

పంతులు పెట్టిన ముహూర్తానికి లావణ్య మెడలో వరుణ్ తాళ్ళి కట్టాలి అని.. అది చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే అంటూ చెప్పుకొచ్చారట . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. కానీ మిస్టర్ సినిమాలో కలిసి నటించిన వరుణ్-లావణ్య చూసి చూడగానే ప్రేమలో పడిపోయారు. ఇన్నాళ్లు వాళ్ల ప్రేమను సీక్రేట్ గా ఉంచి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు..!!