తన అలవాట్లతో తండ్రికి చుక్కలు చూపిస్తున్న జాన్వి కపూర్….!!

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వి కపూర్. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ బ్యూటి బాలీవుడ్ సినిమాలతో పాటు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ‘ దేవర ‘ సినిమాలో కూడా న‌టిస్తుంది. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది జాన్వి.

ఇక మూవీస్ విషయం పక్కన పెడితే జాన్వికి తల్లి శ్రీదేవికి ఉన్న ఒక వింత అలవాటు ఉందట. దాని కారణంగా బోనీకపూర్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడట. శ్రీదేవి ఎలాంటి సినిమాలు చేసిన లేదా ఏదైనా ఫంక్షన్కు వెళ్లిన తానే హైలెట్ కావాలని కోరుకుంటుందట.

మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే మొదటి ప్రాధాన్యత తనకే ఉండాలని చెబుతుందట. అయితే జాన్వి, కపూర్ కూడా తల్లి బాటలోని నడుస్తుంది అని తెలుస్తుంది. ఈవెంట్‌ల‌తోపాటు సినిమాలలోనూ తన పాత్రే హైలెట్ గా ఉండాలని.. అందరి ఫోకస్ తనపైనే ఉండాలని పట్టుబడుతుందట. దీంతో తన తల్లిలా మొండి పట్టుదలను చూసి అసహనం వ్యక్తం చేస్తున్నాడట బోనీకపూర్.