మ‌నం రోజు వినే బిగ్ బాస్ వాయిస్ ఎవరిదో తెలుసా.. అత‌ను చాలా ఫేమ‌స్‌!

బుల్లితెర‌పై మోస్ట్ పాపుల‌ర్ షో బిగ్ బాస్‌. తెలుగులో ఇప్పటికే ఈ షో ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 కూడా ప్రారంభమైంది. మొదటి వారం కంప్లీట్ చేసుకుని రెండో వారంలోకి అడుగు పెట్టింది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా.. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. రెండో వారం ప్రారంభం నుంచి షో మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఎప్పుడు బిగ్ బాస్ వాయిస్ వినడమే కానీ ఆ గొంతు ఎవరిదీ అని ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ షోలో ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకున్న వాటిలో బిగ్ బాస్ వాయిస్ ఒక‌టి. సీజన్లు మారిన బిగ్ బాస్ వాయిస్ మాత్రం మారలేదు. అయితే ఆ వాయిస్‌ ఓ సీనియర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌‌ది. అత‌ని గంభీరమైన వాయిస్‌ను ఎన్నో సినిమాల్లో, సీరియ‌ల్స్ లో కూడా విన్నాము. ఇంత‌కీ బిగ్ బాస్ కు గాత్రదానం చేస్తున్న ఆ వ్యక్తి ఎవ‌రో కాదు.. రాధాకృష్ణ అలియాస్ రేనుకుంట్ల శంకర్.

డబ్బింగ్ ఆర్టిస్ట్స్ లో ఇత‌ను చాలా ఫేమ‌స్‌. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 15 ఏళ్ల‌ క్రితమే కెరీర్ మొదలుపెట్టిన శంక‌ర్‌.. పలు సీరియల్స్, సినిమాలు, అడ్వర్టైజ్‌మెంట్స్ కు కూడా తన గాత్రం అందించారు. తెలుగులో బిగ్ బాస్ షో 2017లో ప్రారంభ‌మైంది. అయితే సీజ‌న్ 1 స్టార్ట్ అవ్వ‌డానికి ముందు సుమారు 100 డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ ల‌ను నిర్వాహ‌కులు పరీక్షించారట. వారందరిలో శంకర్ గొంతు న‌చ్చ‌డంతో.. అత‌న్ని ఫైన‌ల్ చేశారు. షో నిర్వాహకులు ఏం మాట్లాడాలి అని రాసి ఇస్తే.. అతను వాయిస్ ఇస్తాడు. హౌస్ మేట్స్ ను త‌న గంభీరమైన గాత్రంతో కంట్రోల్ చేస్తాడు. ఇక డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా శంక‌ర్ ఎన్నో అవార్డుల‌ను కూడా అంద‌సుకున్నాడు.