2024 సంక్రాంతి నుంచి ఓ సినిమా తప్పుకుంది.. అదేంటో తెలుసా….!!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మూవీ లవర్స్ కి కానీ సినీ ఇండస్ట్రీకి గానీ పెద్ద పండగ సీజన్ ఏదన్నా ఉంది ..అంటే అది కొత్త ఏడాది స్టార్టింగ్‌లో వచ్చే సంక్రాంతి అని చెప్పాలి. ఈ రేస్ లో వచ్చే సినిమాలు ఆ భారీ క్లాష్ లతో చలికాలంలో కూడా ఫ్యాన్స్ కి చెమటలు పటిస్తాయి.

అలా ఇన్నేళ్లలో పలు భారీ క్లాష్ లు కంప్లీట్ అయ్యాయి. ఇక నెక్స్ట్ 2024 సంక్రాంతి రాబోతుంది. అయితే ఈ క్లాష్ లో కూడా పలు భారీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ డేట్ లు లాక్ చేసుకుని ఇంకా డేట్ ఫైనలైజ్ చేయాల్సిన సినిమాలు కూడా సంక్రాంతికే ఫిక్స్ అయ్యి ఉన్నాయి.

ప్రస్తుతానికి హనుమాన్, గుంటూరు కారం, ఈగల్, నా సామిరంగా సినిమాలు అఫీషియల్ గా ఫిక్స్ కాగా.. ప్రభాస్ కల్కి కూడా రేస్ లో ఉంది. అయితే ఈ సినిమాల్లో ఒకటి మాత్రం రేసు నుంచి తప్పుకున్నట్టుగా సమాచారం. లేటెస్ట్ బజ్ ప్రకారం అయితే.. అదే జనవరిలో లేదా మరో నెలకి ఆ సినిమా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి అది ఏ సినిమా అనేది త్వరలోనే తెలియనుంది.