ఆ హీరోయిన్ తో ఇద్దరూ అఫైర్.. చివరికి బద్ధ శత్రువులు అయ్యారు, ఎందుకంటే..

కోలీవుడ్ స్టార్  హీరోలుగా మంచి పేరు సంపాదించుకున్న ధనుష్, శింబు ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈ స్టార్ హీరోలిద్దరికి గతం కొంతకాలంగా గొడవలు బాగా జరుగుతున్నాయి. ఒకరంటే ఒకరికి పడదు అనే విషయం అందరికీ తెలిసిందే. అసలు వీరిద్దరి మధ్య గొడవలు ఎందుకు మొదలయ్యాయి అనే విషయానికి సంబంధించిన ఒక వార్త తాజాగా బయటపడింది.

హీరో ధనుష్ గురించి మాట్లాడుకుంటే అతను నటించే సినిమాలు నేషనల్ అవార్డ్స్ ని అందుకున్నాయి. కథ విషయంలో చాలా ప్రొఫెషనల్ గా ఉంటాడు ధనుష్. సినిమాల విషయంలో మంచి సక్సెస్ సాధించినప్పటికీ వ్యక్తిగత జీవిత విషయంలో మాత్రం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాడు. చాలామంది హీరోయిన్స్ తో ధనుష్ లవ్ ట్రాక్ నడిపాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రకంపనలు స్ట్రష్టించిన సుఛీ లీక్ గురించి అందరికి తెలిసిందే. అయితే అందులో ఎక్కువగా ధనుష్ వీడియోలు,ఫోటోలు బయటకు వచ్చాయి.  ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్యాన్ని పెళ్లి చేసుకొని 20 సంవత్సరాలు కాపురం చేసాడు. ఇటీవలే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు.

ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. తాజాగా ఐశ్వర్య కి సంబంధించిన ఒక వార్త బయటపడింది. ప్రముఖ కాలీవుడ్ హీరో శింబు తో ఐశ్వర్య  ప్రేమాయణం నడిపిందట. కొంతకాలానికి వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారట. శింబు మీద కోపంతోనే ధనుష్,ఐశ్వర్యను వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంలోనే శింబు, ధనుష్ ల మధ్య గొడవ రోజురోజుకి పెరుగుతుందని సమాచారం. ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్న తర్వాత ఒక కోలీవుడ్ హీరో తో ఆమె డేటింగ్ లో ఉందని తెలుస్తుంది. ఐశ్వర్య ఇప్పుడు ధనుష్ ఇంట్లోనే ఉంటుందట.