ఏ ఫంక్షన్ అయినా పరిగెత్తుకుంటూ వచ్చేసే చిరంజీవి..ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలకు రాకపోవడానికి కారణం అదే..!!

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసుకున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ ట్రోలింగ్ కి గురవుతున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ ఆయనట్వీట్ చేసిన ట్వీట్ చేయకపోయినా.. ఫంక్షన్ కి వెళ్లిన వెళ్లకపోయినా ..ఆయనదే తప్పు అంటూ అర్థం వచ్చేలా ట్రోల్స్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు .

ఈ క్రమంలోనే రీసెంట్ గా ఏ ఎన్ ఆర్ శత జయంతి వేడుకలకు చిరంజీవి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే అంటూ కొందరు ఆయనను వల్గర్ గా చీప్ గా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ అన్నా..ఏఎన్నార్ అన్నా.. చిరంజీవి గారికి మహా ప్రాణం . అది అందరికీ తెలిసిందే . కానీ ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలకి ఆయన రాకపోవడానికి పర్సనల్ కారణం ఉంది. ఆయన హెల్త్ కండిషన్ బాగోలేదు .

మోకాళ్ళకి సర్జరీ జరిగింది . డాక్టర్ పూర్తి బెడ్ రెస్ట్ అన్నారు .. ఆ కారణంగానే ఈ మధ్యకాలంలో ఏ ఫంక్షన్ కి అటెండ్ అవ్వడం లేదు . రీసెంట్గా బ్రహ్మానందం కొడుకు పెళ్లికి కూడా అటెండ్ అవ్వలేదు. ఇదే విషయాలను గుర్తు చేస్తున్నారు చిరంజీవి అభిమానులు . అయితే ఇవి పట్టించుకోకుండా కొందరు నాగార్జున ఫ్యామిలీ అంటే చిరంజీవికి చిన్నచూపు అని అందుకే రావట్లేదని పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు..!!