తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ..!!

టాలీవుడ్ లో యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు..గ్లామర్ క్విన్ గా పేరు సంపాదించిన ఈమె ప్రస్తుతం వెండితెర పైన కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో అనసూయ చేసేటువంటి పోస్టులు కూడా ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. ఏ విషయం నైనా సరే డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటుంది అనసూయ.. తన పర్సనల్ విషయాల పైన కూడా ఓపెన్ గా మాట్లాడేస్తూ అందరికీ షాక్ ఇస్తూ ఉంటుంది. తాజాగా తన భర్త భరద్వాజ్ ను వివాహం చేసుకోవడం పై షాకింగ్ కామెంట్స్ చేసింది అనసూయ వాటి గురించి తెలుసుకుందాం.

అనసూయది ప్రేమ వివాహమట ఇంటర్లో ఉన్నప్పుడే భరద్వాజ్ తో పరిచయం ఏర్పడిన తరువాత కొద్ది రోజులకే భరద్వాజ్ ఆమెకు ప్రపొజ్ చేశాడట. అనసూయ కూడా ఒక ఏడాది పాటు తనను తిప్పించుకొని ఓకే చెప్పినట్లు తెలియజేసింది. తొమ్మిదేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2010లో వివాహం చేసుకున్నారట.. వీరిద్దరి తల్లిదండ్రులు వీరి వివాహానికి ఒప్పుకోలేదని.. కానీ ఇద్దరు పట్టుబడి మరీ ఒప్పించి వివాహం చేసుకున్నట్లుగా తెలియజేసింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు.

9 ఏళ్ల ప్రేమలో ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య కుల ప్రస్తావన ఒక్కసారి కూడా రాలేదట.. కేవలం లగ్నపత్రిక రాసే సమయం వరకు అనసూయ భర్త కులం ఏంటి అనే విషయం తనకు తెలియదని తాజాగా పెద్దకాపు -1 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనసూయ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. కుల మతాల ను నేను ఎక్కువగా పట్టించుకోనని లగ్న పత్రిక రాసే వరకు భరద్వాజ్ గోత్రం కులం ఏంటి అనేది తెలియదని తెలిపింది దామిద్దరం కుల మతాలను అసలు పట్టించుకోలేదంటూ తెలిపింది అనసూయ. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.