దీపికా పదుకొనే పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్.. డార్లింగ్ నోట ఇలాంటి మాటలా..? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చిన్న తప్పుడు పనిచేసిన సరే అడ్డంగా ఏకేస్తున్నారు అభిమానులు. మరియు ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలు మాట్లాడిన మాటల్లో మంచి మీనింగ్ కన్నా తప్పుడు అర్ధాలను ఎక్కువగా తీసుకుంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు. కాగ రీసెంట్గా అలాంటి లిస్టులోకే ప్రభాస్ కూడా యాడ్ అయిపోయాడు . పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ప్రెసెంట్ తన ఆశలన్నీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సల్లార్ ..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 సినిమాల పైన పెట్టుకుని ఉన్నారు .

బాహుబలి సినిమా తర్వాత ఒక హిట్ అందుకొని ప్రభాస్ ఈ రెండు సినిమాలు హిట్టయితే మళ్లీ ఇండస్ట్రీలో తన పునర్ వైభవం అందుకుంటాడు అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు . ఇలాంటి క్రమంలోని ప్రభాస్ పై కూసింత ఎక్కువగానే ఫోకస్ చేస్తున్నారు జనాలు . ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు..? ఏం మాట్లాడుతున్నాడు ..?ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు ..? అనేదానిపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు . కాగా రీసెంట్ గా ప్రభాస్ ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం హీరోయిన్ దీపికతో రొమాన్స్ స్పందించాడు .

ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ..” దీపిక పెద్ద సూపర్ స్టార్.. చాలా అందంగా ఉంటుంది..మంచిగా నటిస్తుంది.. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటి దక్కించుకున్నింది..ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి సైతం యాడ్స్ చేసింది ..చాలా చాలా టాలెంటెడ్ . ఆమె సినిమా సెట్స్ కి వచ్చిందంటే కొత్త ఎనర్జీ అందరికి అలా అలా వచ్చేస్తుంది . అందరిలో అదో తెలియని కొత్త ఉత్సాహం వస్తుంది . తనతో ఎప్పటి నుంచో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని ఆశ పడుతున్నా.. ఫైనల్లీ ఆ కోరిక నెరవేరింది ” అంటూ చెప్పుకొచ్చాడు . అయితే ప్రభాస్ మాట్లాడిన మాటల్లో ఎక్కడ తప్పు లేకపోయినా సరే అనుష్క ఫ్యాన్స్ ని హార్ట్ చేస్తున్నాయి..!!