నా మ‌న‌సులో ఉన్న‌ది అత‌డే.. పెళ్లి కూడా అయిపోయిందంటూ బిగ్ బాంబ్ పేల్చిన ర‌ష్మిక‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా చేతి నిండా సినిమాల‌తో కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ తో `పుష్ప 2`, ర‌ణ‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` చిత్రాల‌తో పాటు `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. ఈ మూడు ప్రాజెక్ట్ లు సెట్స్ మీదే ఉండ‌టంతో.. ర‌ష్మిక బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లో పాల్గొంటోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ర‌ష్మిక, టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రేమ‌లో ఉన్నార‌ని గ‌త కొన్నాళ్ల నుంచి పెద్ద ఎత్తున టాక్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.

వీరిద్ద‌రూ చేసిన రెండు సినిమాలే అయినా.. విజ‌య్, ర‌ష్మిక కాంబోకి మాత్రం య‌మా క్రేజ్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే విజ‌య్‌, ర‌ష్మిక ప్రేమ‌లో ఉన్నారంటూ వార్త‌లు ఊపందుకున్నాయి. త‌ర‌చూ వీరిద్ద‌రూ జంట‌గా క‌నిపించ‌డం, క‌లిసి వెకేష‌న్స్ కు వెళ్ల‌డం, డిన్న‌ర్ డేట్స్ అంటూ తిర‌గ‌డం వంటి అంశాలు నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి.

కానీ, ఇంత వ‌ర‌కు విజ‌య్ మ‌రియు ర‌ష్మిక‌లు ఎక్క‌డా త‌మ ప్రేమ‌ను బ‌య‌ట పెట్ట‌లేదు. గ‌ట్టిగా ఖండించ‌నూ లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొన్న ర‌ష్మిక.. ప్రేమ‌, పెళ్లి గురించి మాట్లాడుతూ బిగ్ బాండ్ పేల్చింది. `నరుటో తో నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. నా మనసులో అతడే ఉన్నాడు` అంటూ ర‌ష్మిక పేర్కొంది. దీంతో ఎవరీ నరుటో అంటూ నెటిజ‌న్లు సెర్చ్ చేయ‌డం షురూ చేశారు. నరుటో అంటే ఓ కామిక్ సిరీస్ లో క్యారెక్టర్. వీటికి ప్ర‌త్యేక అభిమానులు ఉంటారు. అందులో ర‌ష్మిక కూడా ఒక‌టి. నరుటో క్యారెక్టర్ తనకు ఎంతో ఇష్టమని ర‌ష్మిక పేర్కొన‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.