ఆ ఏడు వైసీపీ కంచుకోటలే..టీడీపీకి నో ఛాన్స్.!

ఏపీలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు మెజారిటీ సంఖ్యలో వైసీపీకే మద్ధతు ఇస్తున్న విషయం తెలిసిందే. మొదట నుంచి ఈ వగ్రలు కాంగ్రెస్‌కు తర్వాత వైసీపీకి మద్ధతు ఇస్తున్నారు. ఏదో కొంతమేర టి‌డి‌పికి సపోర్ట్ ఉంది. ఇక ఎస్టీలు పూర్తిగా వైసీపీ వైపే ఉన్నారు. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వ్ స్థానాలు 7 ఉన్నాయి. ఆ ఏడు స్థానాల్లో వైసీపీ హవానే ఉంది. పాలకొండ, సాలూరు, కురుపాం, పాడేరు, అరకు, రంపచోడవరం, పోలవరం.. స్థానాలు ఎస్టీ స్థానాలు.

2014లో ఒక్క పోలవరం మినహా మిగిలిన స్థానాలు వైసీపీ గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో అన్నీ స్థానాలని వైసీపీ గెలుచుకుంది. ఇలా వైసీపీకి ఎస్టీ స్థానాలపై పూర్తి పట్టు ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో ఆ స్థానాల్లో ఏమైనా మార్పు జరుగుతుందా? అంటే నూటికి 90 శాతం మార్పు ఉండదనే చెప్పవచ్చు. మళ్ళీ వైసీపీ హవానే నడవటం ఖాయం. అయితే ఇప్పుడు సిటింగ్ ఎమ్మెల్యేలకు పెద్దగా పాజిటివ్ లేదు. అనుకున్న మేర గొప్పగా పనిచేయడం లేదు.

కానీ వారికి జగన్ ఇమేజ్ ప్లస్ అవుతుంది. ఆ స్థానాల్లో ప్రజలు జగన్‌ని చూసే ఓటు వేస్తారు తప్ప..ఎమ్మెల్యేలని చూసి ఓటు వేయరు. అంటే అభ్యర్ధి ఎవరైనా సరే అక్కడ గెలిచేది వైసీపీనే అలాంటి స్థానాల్లో టి‌డి‌పికి పెద్దగా పట్టు లేదు. ఇంతవరకు ఏ స్థానలోనూ టి‌డి‌పికి పట్టు దొరకలేదు. కొద్దో గొప్పో పోలవరంలో టి‌డి‌పికి ప్లస్ కనిపిస్తుంది. ఇక్కడ పోలవరం నిర్వాసితులని ఆదుకోకపోవడం లాంటి అంశం వైసీపీకి మైనస్.

అయితే ఇక్కడ ఎస్టీల కంటే నాన్-ఎస్టీలు ఎక్కువ ఉంటారు. దీని వల్ల టి‌డి‌పికి కాస్త పట్టు ఉంటుంది. గట్టిగా పోరాడితే ఇక్కడ టి‌డి‌పి గెలిచే ఛాన్స్ ఉంది. తప్ప మిగిలిన స్థానాల్లో వైసీపీ హవా నడవటం ఖాయం.