వార్నీ.. పెళ్లి అయి ఇన్నేళ్ళు అవుతున్న ..ఇప్పటికి మహేశ్-నమ్రతలు అలా చేస్తారా..? క్రేజీ కపుల్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా సరే అందరికీ ఆదర్శంగా నిలుస్తారు టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రత . ఇద్దరికీ ఇద్దరే అన్ని విషయాలలో సరితూగుతూ ఉంటారు . అందం – నటన – ఆస్తిపాస్తులు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో .. అయితే ఇలాంటి జంట మధ్య కూడా గొడవలు జరుగుతాయి అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

పెద్ద స్టార్ సెలబ్రిటీ వీళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి ..వీళ్ళకేం గొడవలు వస్తాయని అనుకోవచ్చు.. ఎంత స్టార్ సెలబ్రిటీస్ అయినా వాళ్ళు కూడా మనుషులే కదా.. భార్యాభర్తలే కదా. భార్య భర్తలు అన్నాక గొడవలు సహజం అవి సర్దుకుపోతూ ఉంటాయి. అలాగే నమ్రత మహేష్ జీవితంలో కూడా ఇప్పటికి గొడవలు పడుతూ ఉంటారట . దానికి మెయిన్ రీజన్ సితార – గౌతమ్ అంటూ తెలుస్తుంది . సితార – గౌతమ్ పూర్తి బాధ్యతలను నమ్రత నే తీసుకుందట .

వాళ్ళ స్టడీస్ వగైరా వగైరా అన్నీ కూడా నమ్రతనే హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి ముందుకు తీసుకెళ్తుందట . అయితే పిల్లల పట్ల ముందు నుంచి కేరింగ్ ఉన్న నమ్రత వాళ్లకి ఒక రూపాయి తెలిసే విధంగా పెంచాలి అనుకుంటుంది. మహేష్ బాబు అడిగింది ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఆనందంగా ఉంటారు అనే ఒపీనియన్ ఇలా ఇద్దరి మధ్య రోజు ఏదో ఒక తగదా వస్తూనే ఉంటుందట . అంతేకాదు అలా తగాదా వచ్చినప్పుడు మరింత స్థాయిలో పెరిగిపోతుందట . మొత్తానికి ఎంత స్టార్ సెలబ్రిటీస్ అయినా కామన్ పీపుల్స్ లానే నమ్రత మహేష్ కూడా గొడవ పడుతారు అనే విషయం వైరల్ అవుతుంది..!!