మెగా ఇంట మరో లొల్లి..వరుణ్-లావణ్య పెళ్లికి కొత్త ప్రాబ్లమ్..!?

ఏంటో ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఒకదాని తర్వాత ఒకటి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతున్నాయి మరీ ముఖ్యంగా ఏ ముహూర్తాన నిహారిక విడాకులు తీసుకున్నిందో తెలియదు కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . కాగా రీసెంట్ గానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే . కాగా నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళు గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతున్నారు .

ఇటలీలో త్రీ డేస్ వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లాన్ చేసుకున్నారు . ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి ఎవ్వరు హాజరు కావడం లేదు . కేవలం వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా వరుణ్ తేజ్ – లావణ్య పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. రీసెంట్గా వరుణ్ తేజ్ నటించిన సినిమా గాండీవ దారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెర కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరమ చెత్త టాక్ క్రియేట్ చేసింది .

ఎంతలా అంటే వరుణ్ కెరియర్ లోనే డిజాస్టర్ అనే రేంజ్ లో కలెక్షన్ లు సాధించింది. అయితే దీని అంతటికి కారణం లావణ్య త్రిపాఠి అంటున్నారు జనాలు. లావణ్య త్రిపాఠి వరుణ్ లైఫ్ లోకి రావడం వరుణ్ కి కలిసి రావడం లేదని ఆమె ఐరన్ లెగ్ అని ట్రోల్ చేస్తున్నారు .ఈ క్రమంలోనే లావణ్యను వరుణ్ దూరం పెడితేనే మంచిది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు మెగా ఫ్యామిలీకి హీరోయిన్ కోడలు అయితే అస్సలు అచ్చి రాదు అని ..గతంలో రేణు దేశాయ్ సైతం ఇలాంటి బ్యాడ్ సెంటిమెంట్ ని తీసుకొచ్చిందని ఇప్పుడు వరుణ్ తేజ్ లైఫ్ లోను అలాగే జరగబోతుంది అని ప్రచారం చేస్తున్నారు. దీంతో మెగా ఇంట పెళ్లి సందడి షురూ అయ్యేలోపే మరో కొత్త లొల్లి స్టార్ట్ అయింది అని ఫాన్స్ బాధపడిపోతున్నారు . అయితే వరుణ్ – లావణ్య మాత్రం ఈ కామెంట్స్ ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు . వాళ్ల పెళ్లికి సంబంధించిన పనులను చకచకా పూర్తి చేసుకునే పనిలో బిజీ అయిపోతున్నారు..!!