అటు బాబు-ఇటు పవన్..మధ్యలో లోకేష్..జగన్‌కే మేలు.!

ప్రతిపక్షాలు పూర్తిగా జగన్‌ని రౌండప్ చేశాయి. అన్నీ వైపులా నుంచి జగన్‌ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇటు వైపు జగన్ మాత్రం ఒంటరిగా పోరాడుతున్నారు. తాను కేవలం ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం..జగన్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని, బీహార్ కంటే దారుణంగా ఏపీ పరిస్తితి తయారైందని విమర్శలు చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడటంతో విపక్షాలు జగన్ ప్రభుత్వం టార్గెట్ గా దూకుడు పెంచాయి.

ఇప్పటికే టి‌డి‌పి నుంచి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్రలో జగన్ ప్రభుత్వాన్ని, వైసీపీ ఎమ్మెల్యేలని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం లోకేష్ పల్నాడు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. అటు చంద్రబాబు రాయలసీమ నుంచి సాగునీటి ప్రాజెక్టులని పరిశీలించుకుంటూ వస్తున్నారు. అలాగే బహిరంగ సభలు పెడుతూ జగన్ పై ఫైర్ అవుతున్నారు. తాజాగా నందికొట్కూరులో సభ నిర్వహించారు. ఇక నేడు పులివెందుల, తర్వాత కదిరి..ఇలా వరుసగా శ్రీకాకుళం వరకు బాబు పర్యటించనున్నారు.

అటు పవన్ వారాహి యాత్ర మూడో విడత మొదలుపెట్టనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ యాత్ర మొదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇలా విపక్షాలు జగన్ పై ఎటాక్ చేస్తున్నాయి. కానీ జగన్ మాత్రం ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇలా మంచి చేసే జగన్ పై మాటల దాడి చేయడం వల్ల విపక్షాలకే మైనస్. కాబట్టి జగన్‌కు వచ్చే నష్టమేమీ లేదని చెప్పవచ్చు.