కడప-కర్నూలు మళ్ళీ వన్‌సైడ్..కానీ స్వీప్ డౌట్.!

ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలు..వైసీపీ కంచుకోటలు. గత రెండు ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వైసీపీ హవా స్పష్టంగా నడుస్తుంది. 2014లో రాష్ట్రంలో టి‌డి‌పి హవా ఉన్నా..ఈ రెండు జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. కడపలో 10 సీట్లు ఉంటే వైసీపీ 9 సీట్లు, టి‌డి‌పి 1 సీటు మాత్రమే గెలుచుకుంది. ఇక కర్నూలులో 14 సీట్లు ఉంటే వైసీపీ 11, టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకుంది.

గత ఎన్నికల్లో మాత్రం రెండు జిల్లాల్లో వైసీపీ స్వీప్ చేసింది. మరి ఈ సారి ఎన్నికల్లో ఎలాంటి పరిస్తితి ఉంటుంది. వైసీపీ సత్తా చాటుతుందా? టి‌డి‌పి ఏమైనా పోటీ ఇస్తుందా? అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి టి‌డి‌పి కాస్త పోటీ ఇస్తుందనే చెప్పాలి. అలా అని వైసీపీని ఢీకొట్టే శక్తి టి‌డి‌పికి లేదు. అలాగే వైసీపీ ఈ సారి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. కడపలో 10 సీట్లు ఉంటే వైసీపీకి 7 సీట్లలో ఆధిక్యం ఉంది. 3 సీట్లలో టి‌డి‌పితో గట్టి పోటీ ఎదురుకుంటుంది. మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట సీట్లలో టి‌డి‌పి గట్టి పోటీ ఇస్తుంది.

ఇక కర్నూలు విషయానికొస్తే వైసీపీ ఖచ్చితంగా 8 సీట్లలో గెలవడం ఖాయం..ఆరు సీట్లలో టి‌డి‌పితో పోటీ ఉంది. బనగానపల్లె, కర్నూలు సిటీ, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, ఆదోని సీట్లలో పోటీ ఉంది. అయితే ఆలూరు, బనగానపల్లె, పత్తికొండ సీట్లలో టి‌డి‌పికి కాస్త ఆధిక్యం కనిపిస్తుంది.

అటు ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు సీట్లలో కూడా కాస్త పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది..కానీ వైసీపీకే లీడ్ ఉంది. మొత్తం మీద కర్నూలులో వైసీపీకే ఆధిక్యం రావడం ఖాయం..టి‌డి‌పి రెండు, మూడు సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది.