దండ‌యాత్ర‌కి రెడీ అవుతున్న శ్రీ‌లీల.. వ‌చ్చే ఆరు నెల‌లు ఫ్యాన్స్ కి పూన‌కాలే!

టాలీవుడ్ లో యంగ్ సెన్సేష‌న్ గా మారిన శ్రీ‌లీల బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర‌కి రెడీ అవుతోంది. వ‌చ్చే ఆరు నెల‌ల్లో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాల‌తో ఫ్యాన్స్ కి పూన‌కాలు తెప్పించ‌బోతోంది. ఆగ‌స్టులో ఈ బ్యూటీ `ఆది కేశవ‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. మెగా మేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌, శ్రీ‌లీల జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఆగ‌స్టు 18న విడుద‌ల కాబోతోంది.

అలాగే సెప్టెంబ‌ర్ 18న `స్కంద‌` రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన ఈ చిత్రంలో రామ్ పోతినేని, శ్రీ‌లీల జోడీగా న‌టించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రాబోతోంది. మ‌ళ్లీ నెల రోజుల త‌ర్వాత శ్రీ‌లీల `భ‌గ‌వంత్ కేస‌రి`తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతోంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌, అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 19న విడుద‌ల కానుంది. ఇందులో శ్రీ‌లీల ముఖ్య పాత్ర‌ను పోషించింది.

డిసెంబ‌ర్ 23న శ్రీ‌లీల న‌టించిన `ఎక్స్ ట్రా` ప్రేక్ష‌కుల ముందు రానుంది. ఇందులో నితిన్ హీరోగా న‌టిస్తున్నాడు. ఇక జ‌న‌వ‌రిలో సంక్రాంతి పండ‌క్కి `గుంటూరు కారం`తో సంద‌డి చేయ‌బోతోంది. మ‌హేష్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో శ్రీ‌లీల హెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. మీనాక్షి చౌద‌రి సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. జ‌న‌వ‌రి 13న గుంటూరు కారం రిలీజ్ కానుంది. మొత్తానికి వ‌చ్చే ఆరు నెల‌లు శ్రీ‌లీలదే హ‌వా అని చెప్పుకోవాలి.