వామ్మో.. జాన్వి కపూర్ కి అలా చేయాలని ఉందా..? ఇదేం కోరిక రా బాబోయ్..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ జాన్వి కపూర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిన విషయమే . శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ ధడక్ అనే సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్లో రంగ ప్రవేశం చేసింది . అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. జాన్వి పెద్దగా హిట్ ట్రాక్ ఎక్కలేకపోయింది.

అయితే జాన్వి సోషల్ మీడియాలో మాత్రం అందాల యమ క్రేజ్ సంపాదించుకుంది. అందాల ఆరబోతల విషయంలో ఫుల్ రెచ్చిపోతుంది . రీసెంట్ గానే “బవల్” సినిమాలో నటించిన జాన్వి.. మీడియా ఇంటరాక్షన్ లో లో మాట్లాడుతూ తన మనసులోని కోరికను బయటపెట్టింది . ఈ క్రమంలోనే ఓ అభిమాని ” మీరు ఏ హీరోలతో నటించాలి అనుకుంటున్నారు..?” అంటూ ప్రశ్నించారు .

అయితే జాన్వి దానికి ఆన్సర్ చేస్తూ ..”చాలామంది ఉన్నారు ఎన్టీఆర్ తో నటించాలని అనుకున్నాను. ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది.. ఆ తర్వాత రన్వీర్ సింగ్ ..రన్బీర్ కపూర్..హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్.. ఇలా చాలామందితో నటించాలని ఉంది. కేవలం హీరోలతోనే కాదు డైరెక్టర్ తో కూడా నటించాలని ఉంది అంటూ పెద్ద లిస్టే చెప్పుకొచ్చింది. నీరజ్ ఘెవాన్, సంజయ్ లీల భన్సాలీ, కరణ్ జోహార్ దర్శకత్వంలో నటించడం కోసం తాను ఎదురుచూస్తున్నానని తెలియజేశారు. ఈ విధంగా ఇండస్ట్రీలో తాను ఎవరెవరితో నటించాలని అనుకున్నారో వారందరి లిస్ట్ ఈ సందర్భంగా బయట పెట్టడంతో నెటిజన్స్ ఈమెకు చాలా పెద్ద కోరికల లిస్ట్ ఉంది అంటూ షాక్ అయిపోతున్నారు . ఎవరైనా హీరోలతో నటించాలనుకుంటారు ఈ పాప ఏందీ డైరెక్టర్ తో కూడా నటించాలి అంటుంది అంటూ ఆశ్చర్యకరంగా ఆలోచిస్తున్నారు..!!