బాలీవుడ్ హీరోయిన్ సుస్మితసేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు సినిమాలలో కంటే ఎఫైర్లతోనే ఎప్పుడు వార్తలలో నిలుస్తూ ఉంటుంది…అంతర్జాతీయ అందాల మిస్ యూనివర్సిటీ 1994 విజేతగా కిరీటం సంపాదించుకుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు ఎంతమందితో ప్రేమాయణం నడిపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో ఈమె గురించి ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఏదో ఒక విషయం మారుతూనే ఉంటుంది. అంతేకాకుండా తనకంటే చిన్నవాడైన రోహన్షాలతో రిలేషన్ లో ఉన్నదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
ఇక వీరిద్దరూ కలిసి చట్టపట్టలేసుకొని తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఉన్నట్టుండి అతనితో బ్రేకప్ చెప్పి కొద్ది రోజులు ఒంటరిగా ఉన్నది సుస్మితాసేన్. ఈ మధ్యనే ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోది తో ప్రేమలో పడిందని ఆయనతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా అతని కూడా బ్రేకప్ చెప్పిందని విషయం వైరల్ గా మారుతోంది.. కేవలం డబ్బు కోసమే లలిత్ మోది తో ప్రేమలో పడిందని.. సుస్మిత పైన ట్రోల్స్ కూడా వినిపించాయి.
ఇదిలా ఉంటే వీరిద్దరూ విడిపోయారని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చింది. లలిత్ మోదికి బ్రేకప్ చెప్పినట్టు తెలిపింది సుస్మితసేన్.. ఇటీవల ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో ఈమె బ్రేకప్ అయినా మాట్లాడడం జరిగింది. తన గురించి ఎవరు ఎలా మాట్లాడుకున్నా మంచిదే డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా అంటు తన పైనా ట్రోల్ చేస్తున్నారు. ఈ మాటలు అవమానాలను నేను స్వీకరించినప్పుడే అవమానం అనిపిస్తుంది.. కానీ అలాంటిది నేను అసలు పట్టించుకోనని తెలిపింది నేనెప్పుడూ సింగిల్ గానే ఉంటానట్టుగాటుగా సమాధానాన్ని ఇచ్చింది సుస్మిత.
View this post on Instagram