ఎంతోమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కేవలం అడపా దడపా సినిమాలలో నటించి కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. నటించిన సినిమాలు తక్కువే అయినా ప్రేక్షకుల మధ్యలో గుర్తింపు సంపాదించుకొని క్యారెక్టర్లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో హీరోయిన్ శరణ్య మోహన్ కూడా ఒకరు.. ఇమే తమిళ నటి అయినప్పటికీ పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. అలాగే తెలుగులో నానితో కలిసి భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో అమాయకంగా నటించినా శరణ్య ఈ చిత్రంతో కేవలం తన కళ్ళతో అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో ఎక్కువ చిత్రాలలో నటించింది. తెలుగు తమిళ్ మలయాళం లో సినిమాలు చేసింది. విలేజ్లో వినాయకుడి సినిమాలు నటించి మెప్పించింది. దాదాపుగా 25 సినిమాలలో నటించిన శరణ్య హీరోయిన్ గానే కాకుండా సిస్టర్స్ రోజులో కూడా నటించింది.
2014 తర్వాత ఈమె సినిమాలకు దూరమై వివాహం చేసుకొని నటనకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం శరణ్య తన భర్త పిల్లలతో సంతోష జీవితాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శరణ్య అభిమానులు ఈమె కోసం గూగుల్లో చర్చించగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోలు చూస్తూ ఉంటే ఈమెను గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram