సింగర్ చిన్మయిపై దారుణమైన కామెంట్స్.. అమ్మడి షాకింగ్ రిప్లై ఇది..

సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్మయి ఒకవైపు డబ్బింగ్ చెబుతూ మరోవైపు సింగర్ గా తన కెరీర్ ని సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తుంది. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది. ఇక సమంత వాయిస్ కి చిన్మయి వాయిస్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. సమంత నటించిన చాలా సినిమాలకి చిన్మయే డబ్బింగ్ చెప్పింది. అయితే చిన్మయి ఎప్పుడు వివాదాస్పద వార్తలో నిలుస్తూ అందరి ఆగ్రహానికి గురవుతూ ఉంటుంది. ప్రస్తుతం చిన్మయి చేసిన ఒక ట్విట్ వైరల్ గా మారింది. భారతదేశాని విడిచి వెళ్లడమే నా జీవిత ధ్యేయం అని చెప్పిన ఒక ఎన్ ఆర్ఐ యువతికి చిన్మయి మద్దతుగా ట్విట్ చేసింది.

అసలు విషయంలోకి వెళితే కెనడాలో చదువుకోవడానికి వెళ్ళిన ఒక భారతీయ యువతి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ ఆ యువతిని ఏందుకు కెనడా వెళ్లారు అని ప్రశ్నిస్తారు. యువతి సమాధానం చెప్తూ ‘ భారతదేశం నుండి వెళ్లిపోవడంమే నా కల’  అని చెప్తుంది. అలానే కెనడా లో మీకు నచ్చింది అని అడగగా ‘ కెనడా లో స్వేచ్ఛగా ఉండొచ్చు ‘ అని ఆమె చెప్తుంది. ఆ యువతి చేసిన వ్యాఖ్యలు లు వివాదంగా మారాయి.  తాజాగా ఆ వీడియోపై సింగర్ చిన్మయి స్పందిస్తూ ఆ యువతకి మద్దతుగా నిలిచింది. మాతృ దేశానికి తక్కువ చేసి పరాయి దేశానికి పొగుడుతున్న యువతికి చిన్మయి మద్దతుగా నిలవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిన్మయి స్పందిస్తూ ‘ పరాయి దేశంలో కూడా ఆమె చాలా స్వేచ్ఛగా ఉండగలుగుతుంది. ఆమె ఇండియా విడిచి వెళ్లినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడున్న మహిళలందరు కూడా అలానే సురక్షిత ప్రదేశాలకు వెళ్తే చాలా బాగుంటుంది ‘ అని ట్విట్ చేసింది. చిన్మయి చేసిన ట్విట్ చూసి చాలామంది ఆమేపై విరుచుకుపడుతున్నారు . ‘ నువ్వు ఈ దేశంలోనే ఇంకా ఎందుకు ఉన్నావ్? ఇక్కడ ఉండి డబ్బు పోగేసుకుంటున్నావా? స్వేచ్ఛ లేన్నపుడు ఇక్కడ ఉండడం ఏందుకు ‘ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ కి చిన్మయి స్పందిస్తూ ‘ మంచి డబ్బు,కెరీర్ సంపాదించిన వారిని చూసి నీలాంటి వారు ఏడవడం కోతేమి కాదు. అందరికంటే ముందు నవ్వు ఇండియా వదిలి వెళ్ళాలి’ అని చిన్మయి ఘాటుగా స్పందించింది.