మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా “భోళా శంకర్” . మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఆ నెల 11న థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది. సెన్సార్ నుంచి ఈ సినిమాకు యూ / ఏ సర్టిఫికెట్ వచ్చింది. మొత్తం 160 నిమిషాల రన్ టైంతో ఈ సినిమా ఉంది. ఇక ఈ సినిమాకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మహతి సాగర్ మ్యూజిక్ ఇస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లలో మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా రేజ్ ఆఫ్ భోళా అంటూ వచ్చిన సాంగ్ అయితే పరమ రాడ్ గా ఉంది. ఇది రేజ్ ఆఫ్ భోళా కాదు రాడ్ ఆఫ్ భోళా అన్న విమర్శలు అయితే వస్తున్నాయి. చిరు అభిమానులు కూడా ఇదేం సాంగ్ రా బాబు అని తలలు పట్టుకుంటున్నారు.
ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా.. మరో హీరోయిన్ కీర్తి సురేష్ చిరు కి చెల్లెలి పాత్రలో నటించింది. అలాగే అక్కినేని హీరో సుశాంత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.