సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ `జైలర్`. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, రమ్యకృష్ణ, మలయాళ స్టార్ మోహన్ లాల్, జాకీష్రాఫ్, సునీల్, కన్నడ హీరో శివరాజ్ కుమార్, యోగిబాబు తదితరులు భాగం అయ్యారు.
ఆగస్టు 10 ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్ మరియు `కావాలయ్యా` సాంగ్ తో ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్స్ తో మేకర్స్ మరింత హైప్ పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని స్టార్స్ రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. జైలర్ సినిమాను దాదాపు రూ. 225 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే బడ్జెట్ లో సగం రెమ్యునరేషన్స్ రూపంలో పోయింది. జైలర్ మూవీకి హైయ్యెస్ట్ పెయిట్ యాక్టర్ రజనీకాంతే. ఆయన ఈ సినిమాకు ఏకంగా రూ. 110 కోట్లు తీసుకున్నారట.
అలాగే ఈ సినిమాలో మోహల్ లాల్ గెస్ట్ రోల్ చేశారు. 15 నిమిషాల కంటే లోపే ఆయనకు స్క్రీన్ టైమ్ ఉంటుంది. అయినా కూడా మోహన్ లాక్ ఏకంగా రూ. 8 కోట్లు ఛార్జ్ చేశారట. బాలీవుడ్ యాక్టర్ జాకీష్రాఫ్ కు రూ. 4 కోట్లు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కు రూ. 4 కోట్లు, తమన్నాకు రూ. 3 కోట్లు ఇచ్చారట. ఇక యోగిబాబుకు రూ. కోటి, రమ్యకృష్ణకు రూ.80లక్షలు, సునీల్ కు రూ. 60 లక్షలు ముట్టజెప్పారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.