త్వరలోనే సెట్స్ పైకి ఆర్ ఆర్ ఆర్ 2.. డైరెక్టర్ మాత్రం రాజమౌళి కాదు.. ఫ్యాన్స్ కి బిగ్ షాకిచ్చిన విజయేంద్రప్రసాద్ ..!!

టాలీవుడ్ దర్శకుధీరుడుగా పేరు సంపాదించుకున్న రాజమౌళి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఆర్ఆర్ఆర్ . కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసినా ఆస్కార్ అవార్డును తీసుకొచ్చింది ఈ సినిమానే కావడం గమనార్హం. కాగ ఇంతటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాకు సీక్వెల్ రావాలని ..ఎప్పటినుంచో అభిమానులు కోరుకుంటున్నారు .

అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ . ఆర్ ఆర్ ఆర్ కథను అందించింది విజయేంద్ర ప్రసాద్ అన్న సంగతి అందరికీ తెలిసిందే . కాగా 1200 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ మూవీకి త్వరలోనే సీక్వెల్ రాబోతుంది అంటూ ప్రకటించాడు విజయేంద్ర ప్రసాద్ . అయితే డైరెక్టర్ మాత్రం రాజమౌళి కాదు అంటూ తేల్చేశాడు .

హీరోలు తారక్ – రామ్ చరణ్ కాల్ షీట్ లు బేస్ చేసుకుని ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వస్తుంది అని క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్. డైరెక్టర్ రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబు సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు కాబట్టి..ఆ సినిమా తర్వాత ఆర్ ఆర్ ఆర్ 2 తీయాలంటే చాలా ఆలస్యం అయిపోతుంది . అందుకే రాజమౌళి పర్యవేక్షణలో మరో స్టార్ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించే ఛాన్సెస్ ఎక్కువుగా ఉన్నాయి అంటూ క్లారిటీ ఇచ్చాడు విజయేంద్ర ప్రసాద్ . దీంతో సోషల్ మీడియా లో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!