ప్రముఖ సింగర్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అఫైర్.. లీకైన పిక్స్!

ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అనిరుధ్ పాడిన పాటలు, ట్యూన్స్‌ ప్రపంచాన్ని ఎంతగా ఊపేస్తున్నాయనే దాని గురించి చెప్పనవసరం లేదు. అనిరుధ్ చాలా చిన్న వయసులోనే మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. తన పదేళ్ళ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ ని అందించాడు. అలానే ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అనిరుధ్ కి రసికుడు అనే చెడ్డ పేరు కూడా ఉంది.

ఎందుకంటే అనిరుధ్ ఇప్పటికే చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేసి వార్తలలో నిలిచాడు. ఇక ఇప్పుడు మరో స్టార్ సింగర్‌తో డేటింగ్ కార్యక్రమం మొదలుపెట్టినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈసారి అనిరుధ్ చేతికి చిక్కిన ఆ స్టార్ సింగర్ మరెవరో కాదు సింగర్ జోనీతా గాంధీ. ఈమె ఇప్పటికే ఎన్నో హిట్ సాంగ్స్ ని ప్రేక్షకులకు అందించింది. బీస్ట్ అనే సినిమాలో అరబిక్ కుత్తు అనే సాంగ్ పాడి బాగా ఫేమస్ అయింది. ఆ సినిమా సమయంలోనే అనిరుధ్, జోనీతాల మధ్య పరిచయం బాగా పెరిగింది. దాంతో అనిరుధ్ ‘ విక్రమ్ ‘ అనే సినిమాలో జోనితా కు మరో ఛాన్స్ ఇచ్చాడు.

ఇక అప్పటినుండి వారి స్నేహం కాస్త పెరిగి డేటింగ్ వరుకు దారి తీసింది అని సమాచారం. ప్రస్తుతం ఎక్కడ చూసినా వీరిద్దరే దర్శనమిస్తున్నారు. అనిరుధ్, జోనిత బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు టాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు చూసి త్వరలోనే వారు పెళ్లి చేసుకోబోతున్నారేమో అని చాలామంది ప్రచారం చేస్తున్నారు. కాకపోతే అనిరుద్ కి మాత్రం ఈ డేటింగ్ లు అనేవి చాలా కామన్ అనే విషయం చాలామందికి తెలిసిందే. మరి అనిరుద్,జోనితా విషయం లో కూడా డేటింగ్ తో ముగించేస్తాడా? లేదంటే వారి బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్తాడా? అనేది తెలియాలంటే వేచి చూడాలి.