తెలిసి తెలిసి పెద్ద తప్పు చేస్తున్న రామ్ పోతినేని.. మైండ్ దొబ్బిందా ఏంటి బాసూ..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో రామ్ పోతినేని పేరును తెగ ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. మనకు తెలిసిందే రాం పోతినేని ఈ మధ్యకాలంలో హిట్ కొట్టిందే లేదు. బడా బడా సినిమాలో నటిస్తున్న వరుసగా అన్ని డిజాస్టర్లు అవుతున్నాయి . దీనితో కెరియర్ లో రామ్ హీరోగా ఎదగాలి అన్నా.. హీరోగా కొనసాగాలి అన్నా.. ఆయన సరైన హిట్ కొట్టాల్సిన సమయం దగ్గర పడింది . ప్రెసెంట్ రాంపోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. స్కంద అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్లో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.

ఈ సినిమా ద్వారా హిట్ కొడితే రామ్ కెరియర్ ఎక్కడికి వెళ్ళిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటివరకు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి . అయితే ఇలాంటి క్రమంలోనే రామ్ పోతినేని మళ్లీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా “డబల్ ఇస్మార్ట్” అనే పేరుతో పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కే సినిమాకి కమిట్ అయ్యాడు . దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు గ్రాండ్గా ప్రారంభమయ్యాయి .

జూలై 12 నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలియజేశారు. ఈ క్రమంలోనే రామ్ పోతినేని ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. అసలకే హిట్ కొట్టని నువ్వు అసలు హిట్ అంటేనే ఆమడ దూరంలో ఉన్న పూరి జగన్నాథ్ డైరెక్షన్లో కమిట్ అవ్వడం ఏంటి బాసు ..? స్కంద సినిమా హిట్ అయినా నువ్వు చేసిన “డబల్ ఇస్మార్ట్” సినిమా ఫ్లాప్ అయితే ఈ హిట్టు కూడా నీకు మైనస్ గా మారుతుంది. ఒకవేళ స్కంద ఫ్లాప్ అయ్యి ఇస్మార్ట్ ఫ్లాప్ అయితే నీ కెరియర్ కొల్లాప్స్ అవుతుంది. మంచి నిర్ణయాలు తీసుకో రామ్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు . కాగా ఈ సినిమాలో రామ్ పోతినేని తో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ చేయబోతున్నాడట పూరి జగన్నాథ్ . చూడాలి మరి ఈ సినిమాతో పూరి జగన్నాధ్ తన తలరాతను మార్చుకుంటాడో… లేక రామ్ పోతినేని తలరాతన మార్చేస్తాడో..?