యాంకర్ సుమ తన ఉనికిని కోల్పోనుందా?

యాంకర్ సుమ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 2 దశాబ్ధాలుగా బుల్లితెర పై యాంకర్ గా సుమ తన ఆధిపత్యం కొనసాగిస్తోందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు ఆమెను యాంకర్ గా పెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. పెద్ద బేనర్ సినిమాలు అయితే ఆమె లేనిదే ఫంక్షన్స్ జరుపుకొని పరిస్థితి వుంది. దీనికి తగ్గట్టుగానే ఆమె పారితోషికం కూడ ఏటా పెంచుకుంటూ పోతోంది. అలాంటి సుమకు ఆమె కెరియర్ రీత్యా ప్రమాదం పొంచి ఉందా అంటూ ప్రస్తుతం కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అవును, దీనికి కారణం లేటెస్ట్ గా భాగ్ సాలే యూనిట్ తో బండ్ల గణేష్ చేసిన ఇంటర్యూ అని చెబుతున్నారు.

తాజాగా టాలీవుడ్ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ యాంకర్ గా మారి చేసిన ఇంటర్యూ గురించి అందరికీ విదితమే. ఆ ఇంటర్వ్యూలో భాగంగా సినిమాకు సంబంధించిన విశేషాలు అడుగుతూనే తనదైన స్టయిల్ లో పంచ్ లు వేసి మధ్యలో వేదాంతం చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. దాంతో సదరు ఇంటర్వ్యూ తిలకించిన జనాలు సుమకు అతడు పోటీ అవుతాడు అంటూ జోక్స్ వేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది హీరోలు యాంకర్లుగా మారుతున్న విషయం తెలిసిందే. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ప్రమోషన్ సమయంలో అనీల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగ యాంకర్లుగా మారిపోయిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా గోపీచంద్ మలినేని, బాబి లాంటి దర్శకులు కూడా యాంకర్లుగా మారి షాక్ ఇస్తున్నారు. ‘రావణాసుర’ మూవీ ప్రమోషన్ సమయంలో రవితేజాను, హరీష్ శంకర్ ఇంటర్వ్యూ చేసి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసినదే. అదేవిధంగా పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరిని ఒకసారి రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటర్వ్యూ చేసి ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇక హీరో నాని గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని యాంకర్ గా చాల చక్కగా రాణిస్తున్నాడు. ఇలా అనేకమంది ఫిలిమ్ సెలెబ్రెటీలు యాంకర్లుగా మారిపోవడంతో యాంకర్ సుమకు రానున్నది గడ్డుకాలం అంటూ కొంతమంది నెటిజన్లు సరదాగా జోక్స్ వేస్తున్నారు. కాగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.