రవితేజ-రష్మిక కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్ హిట్ సినిమా ఇదే.. బ్యాడ్ లక్ అంటే ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇంతటి క్రేజీ స్థానాన్ని అందుకున్నాడు అంటే ఆయనలో ఎంత టాలెంట్ ఉందో కూడా మనం గమనించవచ్చు . సినిమా ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులు సర్వసాధారణం. ఎంత పెద్ద హీరోకైనా పాన్ ఇండియా లెవెల్ స్టార్ కైనా ఫ్లాప్స్ పడాల్సిందే . అలా ప్లాప్ పడినప్పుడే ఆ హీరో బౌన్స్ బ్యాక్ అవుతూ నెక్స్ట్ సినిమా క్రేజీ లెవెల్ లో తీస్తాడు.

అయితే మహా మాస్ మహారాజ రవితేజ ఈ మధ్యకాలంలో వరుస ప్లాప్స్ అందుకుంటు వచ్చాడు . అలా ఫ్లాప్స్ కి బ్రేక్ చెప్పిన సినిమా ధమాకా . రవితేజ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా కెరియర్ లో ఫస్ట్ టైం 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ గా రికార్డులు నెలకొల్పింది ధమాకా . ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటించింది . అయితేశ్రీలీల పాత్రలో ముందుగానే డైరెక్టర్ త్రినాధరావు నక్కిన రష్మిక మందన్నాను అనుకున్నారట .

అయితే వరుస ప్లాప్ లో ఉన్న రవితేజ సరసన నటిస్తే ఆమె క్రేజ్ – రేంజ్ – డిమాండ్ తగ్గిపోతుంది అని రష్మిక రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత యంగ్ బ్యూటీ శ్రీలీల సినిమాను ఓకే చేసి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఈ సినిమా విజయానికి రవితేజ ఎంత కారణమో శ్రీలీల కూడా అంతే కారణమంటూ ప్రూవ్ చేసింది. దీంతో మంచి ఛాన్స్ మిస్ అయినట్లయింది రష్మిక మందన్నా..!!