జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. ఏకంగా పెద్ద తలకాయకే గురిపెట్టేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు శ్రీ లీల హవ ఎలా కొనసాగుతుందో మనకు బాగా తెలిసిందే. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుస్తూ టాప్ వన్ హీరోయిన్ గా ప్లేస్ ఆకుపై చేసుకున్న శ్రీలీల ఖాతాలో ఇప్పటివరకు 11 సినిమాలు ఉన్నాయి. కాగా రీసెంట్గా సైన్ చేసిన సినిమాతో ఇప్పుడు ఆమె ఖాతాలో ఏకంగా 12 సినిమాలు గా అయిపోయాయి . ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరి హీరోలతో కుర్ర హీరోలతో సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ప్రజెంట్ భోళా శంకర్ సినిమా చేస్తున్న చిరంజీవి ఈ సినిమా రిలీజ్ అవ్వగానే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా ..బింబిసార డైరెక్టర్ విశిష్ట్ తో మరో సినిమాకి కమిట్ అయ్యారు . కాగా కళ్యాణ్ కృష్ణ సినిమా మల్టీ స్టార్లర్గా తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో యంగ్ హీరో కూడా ఉండబోతున్నారట.

అయితే ఈ సినిమాలో శ్రీలీల కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని శ్రీ లీల – చిరంజీవి కూతురుగా కనిపించబోతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్యకు కూతురుగా నటిస్తుంది శ్రీలీల .ఇప్పుడు చిరంజీవి తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటే అమ్మడు జాతకం తిరిగిపోతుందనే చెప్పాలి . మొత్తానికి శ్రీ లీల ఇండస్ట్రీ పెద్ద తలకాయకి గురిపెట్టి స్టార్ హీరోయిన్గా మారిపోయింది..!!