సితార రక్తంలోనే నటన ఉంది.. అందుకే ఇంత అద్భుతంగా యాక్ట్ చేసింది..

ప్రస్తుతం ఎక్కడ చూసినా స్టార్ హీరో మహేష్ బాబు కూతురు సితార పేరు వినబడుతుంది. సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉంది మహేష్ డాటర్. మహేష్ బాబు కూడా సాధించలేని, సాధ్యం కాని అరుదైన న్యూయార్క్ టవర్స్ పై వ్యాపార ప్రకటన పోస్టర్స్ ద్వారా ఒక్కసారిగా సితార ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దాంతో మీడియా, సోషల్ మీడియా ఫోకస్ మొత్తం సితార పైనే పెట్టాయి. గతంలో ఒక టెలివిజన్ ఛానల్లో ఒక షోకి మహేష్ బాబుతో పాటు సితార కూడా జడ్జ్ గా వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అలానే తాజాగా ఒక వ్యాపార సంస్థ కుదుర్చున్న
అగ్రిమెంట్ మేరకు యాడ్‌లో కూడా నటించింది. ఆ యాడ్‌లో సితార నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆ వ్యాపార సంస్థ ఇచ్చిన రెమ్యునరేషన్‌కి సంబంధించిన విషయాల గురించి సితార చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలోనే అవే పర సంస్థ సితారతో తీసిన యాడ్ ని రిలీజ్ చేసింది. సుమారు మూడు నిమిషాలు ఉన్న ఈ యాడ్‌లో ప్రేక్షకులు జువెలరీ కంటే ఎక్కువగా సితార నటనను చూసి మురిసిపోతున్నారు. పిఎంజె జువెలర్స్ వారు రూపొందించిన ఆ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ యాడ్‌లో సితార అమెరికా నుంచి ఇండియాలోని ఫంక్షన్‌కి వచ్చిన ఒక అమ్మాయిగా నటించింది. ఫంక్షన్ కి రావడం ఇష్టం లేనట్లు సితార చేసిన యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. దాంతో సితార అమ్మమ్మ తనకి ఫంక్షన్ పై కాస్త ఆసక్తి పెంచడం కోసం జ్యువలరీ షాప్ కి తీసుకెళ్తుంది. అక్కడ కూడా నగలు కొనడం అవసరమా అన్నట్లు మాట్లాడుతుంది సితార. దాంతో సీతారను ఆకట్టుకునేందుకు రాజమందిరంలోకి పంపిస్తారు. ఈ యాడ్‌లో అదే పెద్ద హైలెట్ అని చెప్పాలి. ఆ తరువాత సీతారకు నిండుగా ఆభరణాలు పెట్టి అలంకరించడం ఇంకో హైలెట్. దానికి ‘పీఎంజే జ్యువెలర్స్.. వేర్ ప్రిన్సెస్ బికమ్ క్వీన్’ అనే క్యాప్షన్‌తో ఆ యాడ్ ని కంప్లీట్ చేస్తారు. అయితే ప్రేక్షకులు ఎక్కువగా నగలకంటే, సీతారా అందం, అభినయం, నటన చూసి అయిపోతున్నారు. ‘సితార రక్తంలోనే నటన ఉంది ‘ అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.