ఫైనల్లీ .. అనుకున్నది సాధించిన లయ.. ఆ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిందిగా..!?

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాజ్యమేలేసి.. ఓ వెలుగు వెలిగేసి ఆ తర్వాత .. పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు కన్నేసి .. లైఫ్ లో సెటిలైపోయినా హీరోయిన్స్ మళ్ళీ .. ఈ మధ్యకాలంలో ఇప్పుడిప్పుడే రిఎంట్రీ ఇస్తున్నారు . ఇప్పటికే అలాంటి లిస్టులో చాలామంది హీరోయిన్స్ ఉండగా తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోతుంది హీరోయిన్ లయ అంటూ ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో యమ ఆక్టివ్ గా ఉంటూ పలు రీల్స్ ఫన్నీ డైలాగ్స్ క్రియేట్ చేస్తూ ఇన్స్టాల్ లో మరింత హంగామా సృష్టిస్తున్న లయ .. ఈ మధ్యకాలంలో ఎలా టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనకు బాగా తెలిసిందే. కాగా రీసెంట్ గానే యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ అభిమానులకు దగ్గరైన ఈమె సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే పలువురు డైరెక్టర్స్ ఆమెను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయమంటూ సజెస్ట్ చేస్తున్నారట ..పలు ఆఫర్స్ కూడా ఆమెకు కాల్ చేసి మరి ఇస్తున్నారట . అయితే అన్ని ఆఫర్స్ లో ఓ ఆఫర్ బాగా నచ్చడంతో రీ ఎంట్రీకి కరెక్ట్ ఛాయిస్ కావడంతో ఆ సినిమాని చూస్ చేసుకుందట లయ . ఆ సినిమా మరేదో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న బుచ్చిబాబు సనా దర్శకత్వంలోని సినిమా .ఈ సినిమాలో రామ్ చరణ్ హ్యాండీక్యాప్ పర్సన్ గా కనిపించబోతున్నాడు అంటూ తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమా మొత్తం బ్యాక్ టు బ్యాక్ స్పోర్ట్స్ ఎంటర్టైన్ డ్రామగా తెరకెక్కిబోతుందట . అయితే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం లయ ను చూస్ చేసుకున్నారట బుచ్చిబాబు . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్న లయ ఈ సినిమాకి ప్లస్ అవుతుందని… ఆ కారణంగానే ఆమెను చూస్ చేసుకున్నారట , అయితే లయ కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాతో రి ఎంట్రీ ఇస్తే ఆఫర్స్ కూడా బాగా వస్తాయని పైగా హోమ్లి క్యారెక్టర్ కావడంతో అను ఒప్పేసుకుందట . చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?