ఓ మై గాడ్: కెమెరాల ముందే రెచ్చిపోయిన జాన్వీ కపూర్..హాట్ రొమాన్స్ తో హీట్ పెంచేసిందిగా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అతిలోకసుందరి దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా ఆమె తెలుగులో ఎన్టీఆర్ దేవర సినిమాతో తెరంగేట్రం చేయబోతుంది అని తెలిసినప్పటి నుంచి తెలుగు మీడియాలోనూ జాన్వికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే జాన్వి కపూర్ లేటెస్ట్ గా నటించిన “బవల్”సినిమా జూలై 21వ తేదీ నేరుగా ఓటీటీలోనే స్టీమింగ్ కాబోతుంది .

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి ట్రెండీ హాట్ ఫోటోషూట్ చేసింది . అది ఫోటోషూట్ వరకైతే బాగానే ఉండేది ..కానీ హద్దులు మీరిపోయింది ..ఎవరైనా సరే ఇది చూడగానే ఇది ఫోటోషూట్ కాదు రా బాబోయ్. ఇంకేదో అంటూ చెప్పే విధంగా ఉంది. మరీ ముఖ్యంగా జాన్వీకపూర్ వరుణ్ ధావన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నాయి .

అంతేకాదు వరుణ్ ధావన్ ఏకంగా ఆమె ను వెనుక నుండి హగ్ చేసుకుంటూ ఆమె మెడపై ముద్దు పెడుతున్న స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే జాన్వికపూర్ సినిమా ప్రమోషన్స్ కోసం ఎంతైనా తెగిస్తుందని ..ఈ రేంజ్ లో ప్రమోట్ చేస్తే కాని ఆమె సినిమాకి పెట్టిన డబ్బులు రావు అంటూ పచ్చిగా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు ఆకతాయిలు . ప్రజెంట్ సోషల్ మీడియాలో జాన్వీకపూర్ – వరుణ్ ధావన్ లో పిక్స్ వైరల్ గా మారాయి..!!