అందాల గేట్లు ఎత్తేసిన జెనీలియా.. విడాకుల నేపథ్యంలో సినిమాల అవకాశం కోసం పాకులాట!

ప్రముఖ నటి జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘బాయ్స్ ‘ సినిమాతో హీరోయిన్ గా మారిన ఈ అమ్మడు ‘సత్యం ‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది . ఆ తరువాత ఈ అమ్మడు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించింది. తన నాజుగైన అందంతో వెండితెరపై ఒక వెలుగు వెలిగింది ఈ బ్యూటీ. తన నటన, అందంతో వరుస అవకాశాలు దక్కించుకొని దూసుకుపోయింది. తెలుగులో ఈ అమ్మడు సై, బొమ్మరిల్లు, రెడీ లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించింది. అలానే టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో కలిసి నటించే అవకాశం కూడా దక్కించుకుంది.

అయితే స్టార్ హీరోల సరసన నటించిన ప్రతీ సారి ఆమెకి పరాజయమే మిగిలింది. హ్యాపీ, సాంబా, ఆరంజ్ లాంటి సినిమాలే దానికి ఉదాహరణ. ఇక బొమ్మరిల్లులో జెనిలియా పాత్ర మాత్రం ఎప్పటికి మర్చిపోలేం. అయితే పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. 2012 లో నటుడు రితీష్ దేశముఖ్ ని వివాహం చేసుకుంది జెనిలియా. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి తరువాత ఈ భామ ముంబై లో సెట్టిల్ అయింది. ఈ మధ్య జెనిలియా తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. వాటిలో ఎంతవరకు నిజం ఉంది అనేది ఎవరికి తెలియదు. అయితే పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు అందం ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.

 

రోజురోజుకీ జెనిలియా అందం మరింత పెరిగిపోతుంది. సినిమాలకి దూరంగా ఉన్నపటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ చిన్నది వైట్ గౌన్ లో మెరిసింది. ఆ వైట్ గౌన్ లో జెనిలియా తన తండర్ థైస్ ని చూపిస్తూ అదిరిపోయే అందంతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. జెనిలియా మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి జెనిలియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.