ఎన్టీఆర్ 30 లో ఆ బూతు డైలాగ్.. కొరటాల పెద్ద రిస్కే చేస్తున్నాడే..!?

ఇది నందమూరి అభిమానులకు కూసింత డిసప్పాయింటెడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు నందమూరి హీరోలు ఎవరు తెరపై బూతు పదాలను వాడింది లేదు . సినిమాలో ఆ సందర్భం బట్టి కానీ నందమూరి హీరోలు ఎప్పుడు కూడా వల్గర్ గా నీచమైన పదాలను వాడిన సందర్భాలే లేవు . అయితే ఫస్ట్ టైం ఆ రూల్స్ ని బ్రేక్ చేయబోతున్నాడు ఎన్టీఆర్ అంటూ తెలుస్తుంది. ప్రెసెంట్ టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ చేస్తున్న సినిమా దేవర.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు. ఈ క్రమంలోనే కొరటాల ఎన్టీఆర్ దేవర సినిమా ఎలాగైనా హిట్ చేయడానికి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నారట. కాగా ఇప్పటికే ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది. మరో హీరోయిన్గా మృణాల్ – రష్మిక మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే సినిమాలో ఓ మాస్ రేంజ్ లో ఉండే బూతు డైలాగులు ఎన్టీఆర్ చేత చెప్పించడానికి సిద్ధమయ్యాడు కొరటాల అంటూ తెలుస్తుంది .

అయితే స్క్రిప్ట్ ప్రకారం మాత్రం ఎన్టీఆర్ కి ఈ డైలాగ్ వివరించలేదట కొరటాల . రీసెంట్గా అప్పటికిప్పుడే స్పాట్ లో అల్లేసి ఆ డైలాగులు చెప్పించే విధంగా తారక్ ను ఒప్పించాడట . దానికి మెయిన్ రీజన్ ఈ సినిమా కధని మలుపు తిప్పేది ఈ పవర్ఫుల్గా డైలాగ్ అంటూ తెలుస్తుంది. అయితే ఈ డైలాగ్ మాత్రం మనకి తెరపై మనకి వినిపించదు. కేవలం అక్కడ బీప్ సౌండ్ వినిపిస్తుంది . ఈ కారణంగానే ఎన్టీఆర్ సైతం ఈ డైలాగ్ చెప్పడానికి ఒప్పుకున్నారట . అయితే ఎన్టీఆర్ లాంటి హీరోతో అలాంటి బూతు డైలాగ్స్ చెప్పిస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ విషయంలో కొరటాల కొంచం రిస్క్ చేస్తున్నాడు అని చెప్పాలి..!!