రామ్ కంటే ముందే ఆ స్టార్ డైరెక్టర్‌పై కన్నేసిన సింగర్ సునీత.. కానీ..??

ప్రముఖ సింగర్ సునీత గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఈమె ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె ఇద్దరు పిల్లలకి తల్లి అయినప్పటికీ అందం విషయంలో మాత్రం హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తుంది. అయితే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన భర్తతో గొడవలు రావడం కారణంగా అతనికి విడాకులు ఇచ్చేసి తన పిల్లల్ని తీసుకొని వేరుగా ఉంటుంది సునీత.

కానీ సునీత ఇద్దరు పిల్లలు మాత్రం తమ తల్లి ఒంటరిగా ఉంటుందని ఆలోచించి మళ్ళీ పెళ్లి చెయ్యాలనే నిర్ణయం తీసుకొని రామకృష్ణ వీరపనేని అనే వ్యక్తితో సునీతకు మళ్ళీ పెళ్లి చేసారు. అయితే రామకృష్ణ వీరపనేనిని పెళ్లి చేసుకోవడానికి ముందే సునీత ఒక స్టార్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుందట. సునీత ఇష్టపడిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సునీత చాలా యంగ్గా, అందంగా ఉండటమే కాకుండా ఎక్కువగా అవకాశాలు కూడా దక్కించుకుంటుంది. అది తట్టుకోలేని కొంతమంది ఆమె గురించి తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. అవి విన్న సునీత భర్త కిరణ్ నిజంగానే సునీతని అనుమానించడం మొదలుపెట్టాడు.

అంతేకాకుండా కిరణ్ స్నేహితుడైన డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్యతో సునీతకు సంబంధం ఉంది అంటూ ఆమె భర్త కిరణ్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ప్రచారం చేశాయి. అంతేకాకుండా సునీత తన భర్తకు విడాకులు ఇచ్చి ఆ డైరెక్టర్ తోనే సెటిల్ అవ్వాలనుకుంటుందని కూడా ప్రచారం చేసారు. కానీ ఆ వార్తలో ఎలాంటి నిజాలు లేవు. సునీత తాను సంపాదించిన డబ్బులో కొంత కుటుంబ సభ్యులకు, మరికొంత స్నేహితులకు ఇవ్వడం కిరణ్ కి నచ్చక సునీత తో తరచూ గొడవలు పెట్టుకునేవాడట. ఆ గొడవలను తట్టుకోలేక పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసి భర్త నుంచి విడిపోయింది సింగర్ సునీత. ఆ తరువాత ఆమె పిల్లలే మాంగో రామ్ తో ఆమెకి రెండో పెళ్లి చేసారు.