టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్-k చిత్రం నుంచి గ్లింప్స్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. వీటితో పాటు టైటిల్ని కూడా రివీల్ చేయడం జరిగింది.. అమెరికాలోని శాండీయాగో కామిక్ కాన్ వేడుకల ఈ సినిమా టైటిల్ పేరును విడుదల చేయడం జరిగింది.. ప్రాజెక్ట్-k సినిమా టైటిల్ కల్కిగా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రాజెక్ట్-k అంటే ఏమిటి అనే విషయంపై గత కొద్ది రోజులుగా సమాధానం తెలుసుకోవాలని సినీ ప్రేక్షకులు యావత్ భారతీయ ప్రేక్షకుల సైతం చాలా ఆతృతగా ఎదురు చూశారు.
ఎట్టకేలకు కల్కి అనే టైటిల్ రివిల్ అవ్వగానే.. కలియు కాల్ చక్ర కురుక్షేత్ర..k మీనింగ్ ఇదేనంటూ చాలా టైటిల్స్ కూడా వినిపించాయి..ప్రాజెక్ట్-k అంటే కల్కి 2898 AD అని చెప్పేశారు ప్రస్తుతం ఈ గ్లింప్స్ మాత్రం చాలా వైరల్ గా మారుతోంది. ఇందులో ప్రభాస్ కూడా చాలా అద్భుతంగా కనిపించారు. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ సినిమా పైన చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని ఈ గ్లింప్స్ చూస్తే చెప్పవచ్చు.. కల్కి టీజర్ లో ప్రభాస్ ఒక శక్తిగా కనిపించబోతున్నారు కథలో టైం ట్రావెల్ గురించి కూడా హింట్ ఇవ్వడం జరిగింది.
ఇందులో దీపికా పదుకొనే సీన్లు కూడా చూపించారు సినిమా సెట్స్ మీదికి వెళ్ళకముందు నుంచి ఇది ఒక పాన్ వరల్డ్ మూవీ గా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలియజేయడం జరిగింది ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ చూస్తే ఆ మాట నిజమే అన్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ అదిరిపోయేలా ఉందని చెప్పవచ్చు.