సౌత్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీతారామం బ్యూటీ..!!

బాలీవుడ్లో మొదట పలు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన మృణాల్ ఠాకూర్.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే సౌత్ ఇండస్ట్రీలోకి మాత్రం సీతారామం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ తను మొదటి చిత్రంతోనే అందంతో ఆకట్టుకొని అభినయంతో ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే వరుస అవకాశాలు అందుకుంటోంది. అంతేకాకుండా తనకు స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టిన సౌత్ ఇండస్ట్రీ పైన కూడా ఈమె పొగడ్తల వర్షం కురిపిస్తోంది.

Mrunal Thakur Grateful Audience Has Accepted Her In Films, Says Her Aim Is  To Make A Difference

హోమ్ ఇండియా ప్రేమలో పడిపోయింది.. ఇప్పటివరకు చిన్న సినిమాలతో పెద్ద గుర్తింపు లేని ఈ ముద్దుగుమ్మ సక్సెస్ తో స్టార్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించింది. అసలు ఎవరు ఈ సీత అన్నట్లుగా ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు.. అంతే స్పీడుగా అవకాశాలను అందుకుంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం నాని సరసన ఒక సినిమాలో నటించగా విజయ్ దేవరకొండ తో కూడా మరొక సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు సమాచారం.

Mrunal Thakur Age, Family, Boyfriend, Biography & More » StarsUnfolded

అయితే హోమ్ టౌన్ నుంచి అవకాశాలు వస్తున్న మృణాల్ ఠాకూర్ మొత్తం ఫోకస్ అంతా ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీ మీదే పెట్టినట్లుగా తెలియజేస్తోంది .సౌత్ సినిమాతో తనకు బాగా కనెక్షన్ ఉందని తెలుగు సినిమా ఆకాశానికి ఎత్తేస్తూ పలు రకాలుగా కామెంట్లు చేస్తోంది. సౌత్ ఇండస్ట్రీ పట్ల తన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది అంటూ తెలియజేసింది. ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీ ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ అన్న సంగతి సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే తనకు అర్థమయిందని తెలియజేసింది. సౌత్ ఇండస్ట్రీలో ప్రతి పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుందని పేపర్ మీద ఎంత బలంగా రాసుకుంటారో ..అంతే బలంగా తెరమీద చూపిస్తారంటూ తెలియజేసింది. ఇలా పొగడ్తల వర్షం కురిపించడంతో మృణాల్ ఠాకూర్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.