ఆ ముగ్గురు హీరోయిన్ల‌ను ముంచేసిన శ్రీ‌లీల‌.. ల‌బోదిబోమంటున్న బ్యూటీలు!

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ ఎవరు అంటే దాదాపు అందరూ శ్రీలీల అనే చెబుతున్నారు. ఈ అమ్మడు వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. కానీ టాలీవుడ్ ను తనకను సైగ‌లతో శాసిస్తోంది. అటు స్టార్ హీరోలతో పాటు ఇటు యంగ్ స్టార్స్ కూడా శ్రీ‌లీలే కావాలంటున్నారు. దీంతో ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో దాదాపు పది ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది.

అలాగే శ్రీలేల కారణంగా టాలీవుడ్ లో ముగ్గురు హీరోయిన్లు నిండా మునిగిపోయి ల‌బోదిబోమంటున్నారు. ఈ జాబితాలో పూజా హెగ్డే ఒకటి .వరుస ప్లాపులకు తోడు శ్రీలీల హ‌వా దృష్ట్యా పూజా హెగ్డే కెరీర్ దెబ్బ‌కు డౌన్ అయిపోయింది. తెలుగులో ఈ బ్యూటీకి `గుంటూరు కారం` మాత్రమే ఉంది అనుకోగా.. ఈ ప్రాజెక్టు కూడా చేజారింది. పూజా హెగ్డేను తొలగించిన త్రివిక్ర‌మ్‌..గుంటూరు కారంలో మెయిన్ హీరోయిన్ శ్రీలీలను చేశారు.

అలాగే రష్మిక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దూసుకుపోతోంది. అయినాసరే టాలీవుడ్ లో అగ్ర‌హీరోలెవ్వ‌రూ ఆమె వొంక చూడ‌టం లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి హీరోలు సైతం శ్రీలీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక శ్రీలీల ముంచేసిన హీరోయిన్ల జాబితాలో కృతి శెట్టి ఒకటి. కెరీర ఆరంభంలో య‌మా జోరు చూపించిన కృతి శెట్టికి.. ఆ తర్వాత వ‌రుస‌గా ఫ్లాపులు పడ్డాయి. అయినా సరే ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెకు అవకాశాలు వస్తాయనుకుంది. కానీ శ్రీలీల దెబ్బకు ఆమెకు ఛాన్సులు కరువయ్యాయి. దాంతో కృతి శెట్టి కోలీవుడ్ కు మ‌కాం మారుస్తోంది.