తాత బ్లాక్ బస్టర్ సినిమాలో మనవడు ఎన్టీఆర్.. ఆ సూపర్ హిట్ సినిమా ఇదే..!

మన పాత తరం సీనియర్ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ నటించిన ఎన్నో క్లాసికల్ హిట్ సినిమాలను ఈ తరం హీరోలు రీమేక్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ కలిసి నటించిన గుండమ్మ కథ సినిమాను బాలకృష్ణ నాగార్జున కలిసి తీయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు.. ఆ తర్వాత ఈ కుటుంబాల మూడో తరం వారసులు నాగచైతన్య. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చేయాలని అనుకున్నారు.. ఈ సినిమాలో నటించడం చైతన్య ఎన్టీఆర్ కూడా ఇష్టమే.

ఆ సినిమా చూసి NTR అభిమానులు కొడతారని భయపడ్డారట.. ఎందుకో తెలుసా..?? - Telugu  Lives

అయితే ఈ కథను ఇప్పటి తరం వారిని మెచ్చేలా తెరకెక్కించే దర్శకుడే కరువయ్యాడు. అదేవిధంగా సీనియర్ ఎన్టీఆర్ నటించిన క్లాసికల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా రీమేక్ లో నటించేందుకు సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే దానికి కాలం మాత్రం కలిసి రావటం లేదు. ఆ సినిమా మరేదో కాదు రాముడు భీముడు.

ఎన్టీఆర్-రామానాయుడు మధ్య దాగి ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి మీకు తెలుసా ?

1964లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి రామానాయుడు ఈ సినిమాను నిర్మించారు. సినిమా ఇటు ఎన్టీఆర్ కెరియర్ పరంగా అటు రామానాయుడు కి మంచి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయింది. అలాంటి ఈ సినిమా వ‌చ్చిన ఆరు ద‌శాబ్దాల‌కు దీనిని మ‌ళ్లీ ఎన్టీఆర్ మ‌న‌వ‌డు జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో రీమేక్ చేసే ప్ర‌య‌త్నం పెద్ద సాహ‌స‌మే అని చెప్పాలి. ఈ సినిమాను జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో రీమేక్ చేయాల‌ని రామానాయుడు జీవించి ఉన్న‌ప్పుడే ఎంతో ట్రై చేశారు.

NT Rama Rao's 100th Birth Anniversary: His Grandson, Jr NTR Pays Floral  Tribute To The Iconic Actor

ఆయ‌న ఎన్టీఆర్‌ను పిలిపించుకుని.. ఈ సినిమా రీమేక్ గురించి చెప్ప‌డం.. ఎన్టీఆర్ వెంట‌నే ఓకే చేయ‌డం జ‌రిగిపోయాయి. అయితే మంచి డైరెక్ట‌ర్ కోస‌మే తార‌క్‌, ఇటు రామానాయుడు వెయిట్ చేశారు. ఈ లోగా ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్స్‌కు తోడు.. రామానాయుడు మృతి చెంద‌డంతో ఈ ప్రాజెక్ట్ లేట్ అయ్యింది.

NTR:సీనియ‌ర్ ఎన్టీఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ రీమేక్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌... ఆ  హిట్ సినిమా ఇదే..! - Telugu Lives

అయితే ఈ సినిమా రీమేక్ చేస్తాన‌ని రామానాయుడు, సురేష్‌బాబుకు ఎన్టీఆర్ మాట ఇచ్చి ఉన్నాడు. అయితే అది ఎప్పుడు జ‌రుగుతుంది ? ఇప్పుడు ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను రీమేక్ చేస్తే ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు క‌నెక్ట్ చేసేలా హిట్ ఇవ్వ‌డం ఏ ద‌ర్శ‌కుడి వ‌ల్ల అవుతుంద‌న్న‌దే కాస్త స‌స్పెన్స్‌.