హీరోగా ఎన్టీఆర్ అందుకున్న మొట్ట మొద‌టి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!

నందమూరి తారక రామారావు మనవడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యాంకర్ టైగర్ ఎన్టీఆర్.. కెరీర ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని బాక్సాఫీస్ ను షేక్‌ చేశాడు. తనదైన నటన, డైలాగ్ డెలివరీ మరియు డాన్సులతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ముద్ర వేయించుకున్నాడు. తాతకు తగ్గ మనవడుగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఒక్కో ప్రాజెక్ట్ కు వంద కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ పుచ్చుకునే స్థాయికి ఎదిగిన‌ ఎన్టీఆర్.. హీరోగా అందుకున్న మొదటి పారితోషకం ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు. అంత‌కు ముందు బాల‌న‌టుడిగా ప‌లు సినిమాలు చేసిన ఎన్టీఆర్‌.. హీరో న‌టించిన తొలి చిత్రం `నిన్ను చూడాలని`.

ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో నిర్మిత‌మైన‌ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్ర షూటింగ్ సమయానికి ఎన్టీఆర్ వయసు 17 ఏళ్ళు. విడుదల నాటికి 18 ఏళ్ళు. అయితే ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా మెప్పించ‌లేక‌పోయింది. ఇక ఈ సినిమాకు గానూ రూ. 3.5 ల‌క్ష‌లు. టీనేజ్ లోనే అంత డ‌బ్బు సంపాదించ‌డంతో ఎన్టీఆర్ కు ఏం చేయాలో అర్థం కాలేద‌ట‌. చాలా రోజులు ఆ డ‌బ్బునే లెక్క బెడుతూ కూర్చున్నాడ‌ట‌. ఆ త‌ర్వాత ఆ డ‌బ్బు మొత్తాన్ని త‌న త‌ల్లికి ఇచ్చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నేడు ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ విష‌యం ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

Share post:

Latest