మ‌హేష్ – తార‌క్ స్ట్రాట‌జీలు రివ‌ర్స్‌… భ‌లే విచిత్రంగా ఉందే…!

ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఒకరు ఒకరిని ఫాలో అయితే.. తర్వాత తాను ఫాలో అవ్వని వారితోనే ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. సినిమా రంగంలో హీరోలు – హీరోయిన్ల సెంటిమెంట్లు, హీరోలు – దర్శకుల సెంటిమెంట్లు అలాగే నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఒక చిత్ర విచిత్రం జరుగుతోంది. మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టాడు.

Jr NTR heaps praise on Mahesh Babu starrer Bharat Ane Nenu | Entertainment  News,The Indian Express

అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో హీరోగా సక్సెస్ అయ్యాడు. నిన్ను చూడాలని సినిమాతో హీరో అయినా ఆ తర్వాత విజయాలు ఎన్టీఆర్‌ను తిరుగులేని స్టార్ హీరోగా నిలబెట్టాయి. కెరీర్ ఆరంభం నుంచి చూస్తే ఎన్టీఆర్ రాజమౌళితో ఎక్కువ సినిమాలు చేశారు. అలాగే వినాయక్ తోను మూడు సినిమాలలో నటించాడు.

Jr Ntr and Rajamouli's adorable Twitter exchange wins netizens' hearts -  Telangana Today

ఎన్టీఆర్ రాజమౌళితో స్టూడెంట్ నెంబర్ వన్ – సింహాద్రి – యమదొంగ‌.. తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాలు చేసి నాలుగూ సూప‌ర్ హిట్లు కొట్టాడు. ఎన్టీఆర్ ఎక్కువగా రాజమౌళి, వినాయక్‌తో సినిమాలు చేస్తున్నప్పుడు మహేష్ ఈ ఇద్దరు డైరెక్టర్లతోనూ సినిమాలు చేయలేదు. ఇంకా చెప్పాలంటే టైం కలిసి రాలేదు. మహేష్ బాబు త్రివిక్రమ్‌తో ఖ‌లేజా – అతడు సినిమాలలో నటించాడు. ఆ రెండు సినిమాలు మ‌హేష్‌కు మంచి పేరు తెచ్చాయి.

Mahesh Babu's next with Koratala Siva, 'Bharat Ane Nenu' will be launched  in May | Telugu Movie News - Times of India

మహేష్ కొరటాల శివ తో శ్రీమంతుడు భరత్ అనే నేను, వంటి రెండు సినిమాలు చేసి బంపర్ హిట్లు కొట్టాడు. ఈ విధంగా చూస్తే ఎన్టీఆర్ ఎక్కువ సినిమాలు చేసిన దర్శకులతో మహేష్ సినిమాలు చేయలేదు. అలాగే మహేష్ ఎక్కువ సినిమాలు చేసిన దర్శకులతో ఎన్టీఆర్ ఒక్కో సినిమాలో నటించాడు. ప్రస్తుతం మహేశ్ దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ తన 30వ సినిమా దేవర‌ చేస్తున్నాడు. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది.

Jr NTR is all praise for Mahesh Babu's Bharat Ane Nenu

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కు సూపర్ హిట్‌లు ఇచ్చిన రాజమౌళితో మహేష్ కమిట్‌ అయ్యాడు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే దర్శకు ధీరుడు రాజమౌళితో భారీ పోనుపాన్‌ ఇండియా సినిమాలో నటించబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఇద్ద‌రీ హీరోల కేరీర్‌లో ఇలా చిత్ర‌మైన‌ సంఘటనలు జరుగుతున్నయి. ఏదేమైనా ఇద్దరు తమ కేరీర్‌ను చక్కగా ప్లానింగ్ చేసుకుంటూ సూపర్ హిట్లు కొడుతున్నారు.